మద్యం చిత్రవిచిత్రాలు చేయిస్తుంది. ఆ మత్తు తలకెక్కితే నీళ్లేవో.. యాసిడ్ ఏదో తెలియదు. అలా ఓ వ్యక్తి నీళ్లనుకుని మద్యంలో యాసిడ్ కలుపుకుని తాగి మృతి చెందాడు.
మంచిర్యాల : liquor తాగడం వల్ల మనిషి ప్రాణాలు నెమ్మదిగా హరిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మద్యం మత్తు మాత్రం క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. ఘోరాలు చేయిస్తుంది. అలాంటి ఘటన Manchiryalaలో జరిగింది. మద్యం మత్తులో నీళ్లు అనుకుని acid ను కలుపుకుని తాగి ఓ వ్యక్తి మృతి చెందిన చెందాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్ల హాజీపూర్ మండలం ముల్కల్లలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రవేని మహేష్ (29) సింగరేణిలో ఉద్యోగం చేస్తాడు. గతనెల 18న Alcohol intoxicationలో మంచినీరు అనుకుని యాసిడ్ బాటిల్ లోని యాసిడ్ ను మద్యంలో కలుపుకుని తాగాడు.
దీంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. ఇది గుర్తించిన అతడి కుటుంబసభ్యలు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న అతను ఈ రోజు మృతి చెందినట్లు హాజీపూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ తెలిపారు. మహేష్ కు తండ్రి శంకరయ్య, తల్లి లక్ష్మి, భార్య స్వర్ణలత, కుమారుడు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మే 2న ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. తాగి వచ్చిన మైకంలో భార్యతో గొడవ పడ్డ వ్యక్తి.. ఆమె మీద కోపంతో గొడ్డలి ఎత్తాడు. ఆమె ప్రాణభయంతో పారిపోవడంతో ఆవేశంతో ఊగిపోయాడు. liquor మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో కళ్ళముందు ముగ్గురు చిన్నారులు కనిపించారు. ఆవేశంతో ఊగిపోతున్న తండ్రిని చూసి బిక్కుబిక్కు మనడం తప్ప మరేమీ తెలియని 5 ఏళ్ల కుమార్తె, తండ్రిని గుర్తు పట్టడం తప్ప పరిస్థితి అర్థం చేసుకోలేని రెండేళ్ల కుమారుడు.. తల్లి దగ్గర లేకపోవడంతో పాల కోసం ఏడుస్తున్న ఆరు నెలల చిన్నారి.
ఆ స్థితిలో ఆ పసి వాళ్ళని చూసైనా ఆ కర్కశుడి మనసు కరగలేదు. కానీ, మద్యం మత్తులో తాను ఏం చేస్తున్నాడో మర్చిపోయి… తన సొంత పిల్లలని కూడా చూడకుండా గొడ్డలికి పని చెప్పాడు. ముగ్గుర్ని తెగనరికి… ఆ తర్వాత ఓ బావిలో పడేశాడు. ఈ దారుణం odishaలో చోటు చేసుకుంది. సుందర్ గఢ్ జిల్లా కొయిడా జిల్లా కులా గ్రామానికి చెందిన పండు ముండా శనివారం సాయంత్రం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవపడి గొడ్డలితో ఆమెను వెంబడించాడు. ప్రాణ భయంతో ఆమె దాక్కోవడంతో ఇంటికి వచ్చి అభం, శుభం తెలియని తన ముగ్గురు పిల్లల్ని సీమ(5), రాజు (2), ఆరు నెలల చిన్నారిని గొడ్డలితో నరికి చంపాడు.
ఆ తర్వాత deadbodyలను బావిలో పడేసి స్థానికంగా ఉండే అడవిలోకి పారిపోయాడు. ఆదివారం ఉదయం తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి వారు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికింది. చివరికి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కొన్ని గంటల వ్యవధిలో ఈ దారుణానికి పాల్పడిన పండు ముండాను అదుపులోకి తీసుకున్నారు.
