భార్యపై కోపంతో వేగంగా బండి నడిపిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ జిల్లా మేదరిమెట్ గ్రామానికి చెందిన మేకా గోపీచంద్ (42) ..నిర్మల్ పట్టణంలోని గొల్లపేట్‌లో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు
భార్యపై కోపంతో వేగంగా బండి నడిపిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ జిల్లా మేదరిమెట్ గ్రామానికి చెందిన మేకా గోపీచంద్ (42) ..నిర్మల్ పట్టణంలోని గొల్లపేట్‌లో భార్యా పిల్లలతో నివాసముంటున్నాడు .
శుక్రవారం ఇంటి వద్ద ఏదో విషయంలో భార్యా భర్తల మధ్య వివాదం చెలరేగింది. అయితే భార్యపై ఆగ్రహంతో అర్థరాత్రి తమ స్వగ్రామమైన మేదరిపేట్‌కు వెళ్తానని గోపీచంద్ నిర్మల్ నుండి బయలు దేరాడు.
ఈ క్రమంలో కనకాపూర్, బాబాపూర్ గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం సందర్బంగా రోడ్డుకు అడ్డంగా పెట్టిన సేప్టీ బోర్డును వేగంగా ఢీకొట్టాడు గోపీచంద్. అనంతరం బ్రిడ్జీ నిర్మాణం కోసం పక్కనే తీసిన పిల్లరు గోతిలో పడిపోయి ఘటనాస్థలిలోనే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
