కరోనా సోకి వేలాదిమంది చనిపోతుంటే.. కరోనా వస్తుందన్న భయంతో మరికొంతమంది బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా వచ్చినా మానసికస్థైర్యంతో దాన్నుంచి బయటపడొచ్చన్న అంశాన్ని మరిచిపోయి.. నిండు జీవితాన్ని.. తమ మీద ఆధారపడ్డవారిని, ఆత్మీయులను విషాదంలో ముంచేస్తున్నారు.

తాజాగా కరోనా వస్తుందన్న భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్, నార్సింగ్ లో కలకలం రేపింది. నార్సింగ్‌ పోలీసుల కథనం ప్రకారం...ఉత్తర ప్రదేశ్ జామ్సీ జిల్లాకు చెందిన రవిరేక్వార్ (30) కోకాపేట్ లో కుక్ గా పనిచేస్తున్నాడు. 

అత్తామామలతో కలిసి ఇక్కడ ఉంటున్నాడు. ఈ క్రమంలో మామ సుశీల్ కు ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో తనకు కూడా కరోనా వస్తుందేమోనని భయపడ్డాడు. 

దీంతో మంగళవారం రవి ఆత్మహత్య చేసుకున్నాడు. తన దగ్గరున్న డబ్బులు తన కుటుంబ సభ్యలకు పంపించాలని అత్తామమలకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.