Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో కత్తితో గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య..

నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.మృతుడు అజార్ (35)గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజులుగా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Man commits suicide by stabbing himself in Hyderabad
Author
Hyderabad, First Published Jan 24, 2022, 11:02 AM IST

హైదరాబాద్ : Hyderabadలో దారుణం జరిగింది. నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత ఘోరంగా suicideకు పాల్పడ్డాడు. తలాబ్ కట్టా భవానీ నగర్ లో knifeతో గొంతు కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడా వ్యక్తి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మృతుడు అజార్ (35)గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజులుగా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోనే జరిగింది.  wifeతో గొడవలు, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి suicide చేసుకున్నాడు. మీర్ పేట ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ కు చెందిన శ్రీరాములు శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్ పేట్ లోని లక్ష్మీ దుర్గ కాలనీలో స్థిరపడ్డాడు. 2019లో జనగామకు చెందిన రవళి (26)తో అతడికి marriage అయింది. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా  దంపతులు తరచూ conflicts పడుతున్నారు.

ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో husbandతో గొడవపడి కుమార్తెను తీసుకుని  పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రావణ్ కుమార్ మానసికంగా కుంగిపోయి liquorకి బానిసయ్యాడు. అప్పుడు పెరగడంతో లక్ష్మీ దుర్గ కాలనీలోని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న రవళి అందులో తనకు వాటా ఉందని. వాటా తేలేవరకూ ఇల్లు అమ్మకానికి పెట్టొద్దని Legal noticeలు పంపించింది.

దాంతో మనస్తాపం చెందిన శ్రావణ్ కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటివారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 

ఇక ఆంధ్రప్రదేశ్ లోని అనంతరపురంలో అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ bank employee భార్య suicide చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మవరంలోని నేసేపేటకు చెందిన వెంకటకృష్ణ... తాడిమర్రిలోని SBI శాఖలో పనిచేస్తున్నాడు. 2016లో YSR District పొద్దుటూరు కు చెందిన కొండయ్య, గంగాదేవి  దంపతుల కుమార్తె వెంకట సుజన (26)ను పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లి సమయంలో రూ. 18 లక్షల కట్నం, 30 తులాల బంగారు నగలు సుజన తల్లిదండ్రులు అందజేశారు. కొన్నేళ్లు వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా సృజన, వెంకటకృష్ణ మధ్య మనస్పర్ధలు చెలరేగి తరచుగా గొడవ పడేవారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి పైన మూడో అంతస్తులో సుజన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios