బాలానగర్ ఫ్లైఓవర్ మీద నుంచి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది.
హైదరాబాద్: నగరంలోని బాలానగర్ ఫ్లైఓవర్ మీద నుంచి దూకి ఓ వ్యక్తి తాగిన మత్తులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం విషయం తెలియగానే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెల్డింగ్ వర్కర్ అశోక్‌గా గుర్తించారు. అతడు గతంలో కూడా తాను చనిపోతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఈసారి మద్యం మత్తులో ఫ్లైఓవర్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
వివరాలు.. అశోక్ వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తూ కోమటిబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడు కొంతకాలం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవలి కాలంలో అతడు మద్యానికి బానిసగా మారాడు. ఇందుకోసం భార్యతో పాటు, ఎస్సార్ నగర్‌లోని బంధువుల వద్ద అప్పులు చేశాడు. అయితే వారు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడ్డాడు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన బంధువులు కాపాడారు.
తాజాగా సోమవారం ఎవరికీ సమాచారం ఇవ్వకుండా మద్యం మత్తులో అశోక్ బాలానగర్ ఫ్లైఓవర్ పైనుంచి దూకాడు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్టుగా వైద్యులు నిర్దారించారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
