సికింద్రాబాద్ లో దారుణం... రైలుకు దండం పెట్టి మరీ వ్యక్తి ఆత్మహత్య, లోకో పైలెట్ హారన్ కొట్టినా...
సికింద్రాబాద్ లో ఓ వ్యకి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు రైలుకు దండం పెట్టాడు. అయితే, ఆ వ్యక్తి ఎవరో గుర్తించడం కష్టంగా మారింది.
సికింద్రాబాద్ : ఎదురుగా వస్తున్న రైలు దండం పెట్టి మరి ఓ వ్యక్తి దాని కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ సిఆర్పి పోలీసుల కథనం ప్రకారం... ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న గోదావరి ఎక్స్ప్రెస్.. చర్లపల్లి- ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి (35) దాని కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రైలు ఎదురుగా వెళ్లి... రెండు చేతులను జోడించి.. దండం పెడుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ముందు ఆ వ్యక్తి పట్టాలపైకి చేరుకోవడాన్ని రైలు ఇంజన్ లో ఉన్న లోకో పైలెట్ సురేష్బాబు గుర్తించాడు.
హారన్ కొట్టినప్పటికీ ఆ వ్యక్తి పక్కకు వెళ్ళలేదు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని చిరునామాకు సంబంధించిన ఎలాంటి గుర్తింపు వివరాలు లభ్యం కాకపోవడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడు పసుపు రంగు షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే ఆత్మహత్యకు గల కారణాలు గుర్తించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఖమ్మం జిల్లాలో కీచక హెడ్‌మాస్టర్.. విద్యార్థినీలతో అసభ్య ప్రవర్తన, వెకిలి చేష్టలు..
ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. రైలు కింద పడి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇష్టపడిన యువకుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే, ఆ యువకుడు గాయాలతో బయటపడగా, ఆమె మృతి చెందింది. జిఆర్పీ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి… గోపాలపట్నం సమీపంలోని కొత్తపాలేనికి చెందిన కొణతాల హేమలత (25) భర్తతో విభేదాల కారణంగా రెండేళ్లక్రితం విడిపోయింది. అప్పటినుంచి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళ పాలెంలోని పుట్టింట్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో కోటనరవకు చెందిన ఆటో డ్రైవర్ కె. కుమార్ తో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అమ్మగారి ఇంటి నుంచి హేమలత బయటకు వెళ్లి కుమార్ ను కలిసింది. ఇద్దరూ కలిసి సతివానిపాలెం రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రాత్రంతా గడిపారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున ఇద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరూ కలిసి ట్రాక్స్ మీద పడుకున్నారు. అయితే రైలు రావడం ఆలస్యం కావడంతో ఇద్దరూ సమీపంలోని బడ్డీ వద్దకు వచ్చి కాసేపు గడిపారు. మళ్లీ కాసేపటి తర్వాత ఆత్మహత్యాయత్నానికి సిద్ధమయ్యారు.
నన్ను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని అనుకుంటున్నారు: లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కవిత
ఈ క్రమంలో ఆఖరి క్షణంలో మనసు మార్చుకున్న కుమార్ ఆ ప్రయత్నం విరమించుకుందామని హేమలతను వెనక్కి లాగే ప్రయత్నం చేశాడు. కానీ హేమలత ససేమిరా అని రైలుకు ఎదురుగా వెళ్ళింది. ఈ గ్రామంలో ఇద్దరికీ పెనుగులాట జరిగింది. రైలు వేగంగా రావడంతో ట్రాక్ మీద ఉన్న హేమలతను బలంగా ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే సమయంలో కుమార్ పక్కకి ఉండడంతో రైలు వేగానికి తుళ్ళి రాళ్ళపై పడిపోయాడని.. జిఆర్ పి పోలీసులు భావిస్తున్నారు.