Asianet News TeluguAsianet News Telugu

నన్ను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారని అనుకుంటున్నారు: లిక్కర్ స్కామ్ ఆరోపణలపై కవిత

ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌పై తనపై వస్తన్న ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

KCR Daughter Kavitha Response on Delhi liquor Scam Allegations
Author
First Published Aug 22, 2022, 12:56 PM IST

ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌పై తనపై వస్తన్న ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. బీజేపీ నేతలు తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు.  ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా  కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతిపక్షాలపై బట్టకాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. నిరాధారంగా ఏది పడితే అది మాట్లాడటం ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకర పరిణామం కాదని అన్నారు. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా ప్రస్తుత అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

కేసీఆర్ కూతురు కాబట్టే తనపైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే.. కేసీఆర్ భయపడతాడని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోందని కవిత అన్నారు. ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలని చూస్తున్నారని అన్నారు. తన కుటుంబం గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని.. అయితే అది కుదరదని పని అన్నారు. 

Also Read: చిక్కుల్లో కల్వకుంట్ల కవిత.. లిక్కర్ పాలసీ స్కామ్ లో ఆమె పాత్ర ఉంద‌ని బీజేపీ ఆరోప‌ణ‌

వారి చేతిలోనే అన్ని దర్యాప్తు సంస్థలు ఉన్నాయని.. వారికి ఎటువంటి విచారణ కావాలన్న చేసుకోవచ్చని కవిత చెప్పారు. తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు. 
ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని.. ఎవరికీ భయపడేది లేదని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios