భార్యను నీళ్ల బకెట్ లో ముంచి చంపి, ఆపై భర్త ఆత్మహత్య.. అసలేం జరిగిందంటే..

హైదరాబాద్ లో కలకలం రేపిన జంట మరణాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానంతోనే భార్యను హత్య చేసి, అతను ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 

Man commits suicide after killing wife over argument in Hyderabad

హైదరాబాద్ : అనుమానం పెనుభూతమయ్యింది. చివరికి ఎంతో ఇష్టంగా ప్రేమించి, పెళ్లిచేసుకున్న భార్యనే అతి కిరాతకంగా murder చేసేలా విచక్షణ కోల్పోయేలా చేసింది. భార్యను చంపడమే కాదు.. ఆ తరువాత తన జీవితమూ వ్యర్థం అనుకున్నాడో ఏమో అతనూ suicide చేసుకున్నాడు. ఈ విషాద ఘటన Hyderabadలో మంగళవారం కలకలం రేపింది. హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య అనుమానం రాజుకుని ఇద్దరి ప్రాణాలను తీసింది. దీంతో భార్యను నీళ్ళ బకెట్లో ముంచి చంపిన భర్త.. తాను రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

హైదరాబాదులోని పంజాగుట్ట డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం..  అస్సాంకు చెందిన మహానంద బిశ్వాస్ (24), పంపా సర్కార్ (22) ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర కిందట పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత జీవనోపాధి నిమిత్తం కొన్నాళ్ల క్రితం నగరానికి వచ్చారు. వచ్చిన మొదట్లో  ఆదిభట్లలోని ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డులుగా పని చేశారు. ఆ తర్వాత పంజాగుట్ట సమీపంలోని ప్రేమ్ నగర్ లో ఇల్లు అద్దెకు  తీసుకుని ఉంటూ.. బంజారాహిల్స్ లోని  ఓ ప్రముఖ మాల్ లో సెక్యూరిటీ గార్డులుగా  చేరారు.

భార్యను చంపి బకెట్‌లో కుక్కి.. రైలు కింద పడ్డ భర్త, సూసైడ్ నోట్‌తో వెలుగులోకి దారుణం

అయితే, ఇక్కడికి వచ్చిన కొన్ని రోజులకే భార్య ప్రవర్తనపై మహానంది బిశ్వాస్ కు అనుమానం మొదలయ్యింది. అది రోజులు గడిచిన కొద్దీ పెరుగుతూ వచ్చింది. ఈ అంశంపై ఇద్దరూ తరచూ ఘర్షణ పడేవారు. సోమవారం మధ్యాహ్నం భార్య పంపా సర్కార్ తో మళ్లీ గొడవ పడిన బిశ్వాస్.. ఆమెను బలవంతంగా నిండా నీళ్లు ఉన్న బకెట్లో తల ముంచి  హతమార్చాడు. ఆ తరువాత  ఆ గదికి తాళం వేసి  బయటికి వెళ్లాడు.  ఏమనుకున్నాడో ఏమో తెలియదు కానీ.. లక్డీకాపూల్ రైల్వే స్టేషన్ సమీపంలోని వంతెన వద్ద  రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

అతడి వద్ద లభించిన ప్యాకెట్ డైరీలో అస్సామీ భాషలో.. తన భార్యను చంపి ఆత్మహత్యలకు పాల్పడుతున్నానని రాసి ఉండటాన్ని రైల్వే పోలీసులు గుర్తించారు. దీంట్లో ఇంటి చిరునామా సైతం ఉండటంతో పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పంజాగుట్ట పోలీసులు వారి ఇంటి వద్దకు చేరుకుని తాళం పగులగొట్టి చూడగా పంపా సర్కార్ మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios