హైదరాబాద్ ఖైరతాబాద్ లో భార్యను చంపిన భర్త అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను పంపా, మహానంద్‌గా గుర్తించారు పోలీసులు. భర్త సూసైడ్ నోట్ కారణంగా దారుణం వెలుగులోకి వచ్చింది.  

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య పంపాను హత్య చేసి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యను చంపి బకెట్ లో పెట్టాడు భర్త మహానంద్. అనంతరం నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద రైలు కింద పడి మహానంద్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగంలోకి దిగిన పోలీసులు సూసైడ్ నోట్ ఆధారంగా పంపా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred