నిత్య పెళ్లికొడుకు.. ఒకే కాలనీలో మూడు వీధుల్లో, ముగ్గురు భార్యలు.. ఏడు పెళ్లిళ్లు, మరో మహిళతో పరార్..

ఓ వ్యక్తి ఒకరికి తెలియకుండా మరొకరిని.. ఇంకా చెప్పాలంటే ఒకే కాలనీలో.. పక్క పక్క వీధుల్లో ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. అదీ రెండో పెళ్లి పేరుతో మోసం చేసి.. లక్షల్లోడబ్బులు గుంజాడు. ఇతని మోసం ఎట్టకేలకు బయటపడింది. 

man cheated seven women in the name of marriage in hyderabad

హైదరాబాద్ : ఒకే కాలనీలో ముగ్గురు భార్యలు.. పక్కపక్కవీధుల్లో ఒకరికి తెలియకుండా మరొకరితో కాపురం...మొత్తం ఏడు పెళ్లిళ్లు...అది కూడా విడాకులు తీసుకుని.. ఉద్యోగాలు చేస్తూ.. బాగా చదువుకున్న.. రెండో పెళ్లి కోసం ఎదురుచూస్తున్న మహిళలే టార్గెట్.. ఇంకేముంది.. నకిలీ విడాకుల పత్రాలు, పే స్లిప్ లతో మోసం చేశాడు. మొత్తంగా ఏడుగిరిని పెళ్లాడి.. ఇప్పుడు ఇంకో మహిళతో పరారీలో ఉన్నాడు. బుధవారం ఈ మేరకు అతని ఇద్దరి భార్యలు సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో అతనిమీద ప్రెస్ మీట్ పెట్టారు.

భార్యకు విడాకులు  ఇవ్వకూడానే నకిలీ విడాకుల పత్రాలు సృష్టించి ఓ వ్యక్తి వరుసగా పెళ్ళిళ్ళు చేసుకున్న ఉదంతం ఇది.  అతని టార్గెట్ అంతా విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసే బాగా డబ్బున్న మహిళలే. వారికి కొత్త జీవితం ఇస్తానని ఆశలు కల్పించి ఏకంగా ఏడు వివాహాలు చేసుకున్నాడు ఈ నిత్య పెళ్లి కొడుకు. ఓకే కాలనీలోని మూడు వీధుల్లో.. ముగ్గురు ఉండడం గమనార్హం. అయితే ఈ విషయం ఎలా బయటపడిందంటే..ఓ మహిళను ఇలాగే పెళ్లి చేసుకున్నాడు. 

పెళ్లయిన కొన్నాళ్ళు నమ్మకంగా మాట్లాడి.. ఏవో కారణాలు చెప్పి లక్షలో  డబ్బు గుంచి ఇప్పుడు మరో మహిళతో కాపురం చేస్తున్నాడు. ఇతడి నిర్వాకంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇతని బాధితుల్లో హైదరాబాద్ మహిళలే ఎక్కువ మంది. ఉన్నత విద్యావంతులే. ఉద్యోగాలు చేస్తున్నవారే. మోసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించడంతోపాటు… తమ లాగా ఇంకెవరూ మోసపోకుండా చూడాలని కోరుతూ ఇద్దరు బాధిత  మహిళలు బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో వివరాలు వెల్లడించారు.

సెకండ్ మ్యారేజ్ మహిళలే టార్గెట్…
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన అడపా శివ శంకర్ బాబు ఇంజనీరింగ్ చదివాడు. మ్యాట్రిమోనీ సైట్ లో రెండో పెళ్లి కోసం పేరు నమోదు చేసుకున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగం చేస్తున్న మహిళలను సంప్రదించేవాడు. తనకు వివాహం అయి విడాకులు తీసుకున్నానని నకిలీ డైవోర్స్ పేపర్స్ చూపించి వారిని నమ్మించాడు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగిని, దాదాపు రెండు లక్షల దాకా జీతం వస్తుందని పేస్లిప్ చూపించాడు. 

ఇవన్నీ నమ్మిన ఆ మహిళ కుటుంబ సభ్యులు ఘనంగా పెళ్లి జరిపించారు.  వెంటనే అతడు భార్య ఉద్యోగం మాన్పించేశాడు. ‘ప్రాజెక్టు పనిమీద అమెరికా పంపుతున్నారు. ఇద్దరం వెళ్దాం అని చెప్పి పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. దీని కోసం డబ్బు అవసరమని భార్య నుంచి అత్తింటిలో అందరి నుంచి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర అందినకాడికి డబ్బులు తీసుకున్నాడు. తరువాత అమెరికా ప్రయాణం వాయిదా పడింది అని చెప్పి ఎప్పటిలాగే గడిపేవాడు. ఇచ్చిన డబ్బులు అత్తింటివారు అడగగా రేపు, మాపు అంటూ రోజులు గడిపాడు. 

గట్టిగా అడిగేసరికి పోలీసులకు ఫిర్యాదు చేసుకోమన్నాడు. దీంతో బాధిత మహిళా మెదక్ జిల్లా రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించగా వారు శివశంకర్ బాబు పిలిపించారు. ఆ సమయంలో మరో మహిళతో ఠాణాకు వచ్చిన అతను ఈమె తన భార్య అని చెప్పాడు. డబ్బు ఇచ్చే భరోసా తమదేనని చెప్పాడు. ఆమెను మధ్యవర్తిగా ఉంచాడు. భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పి పెళ్లి చేసుకున్న వ్యక్తి మరో మహిళను భార్య.. అని చెప్పడం అనుమానం రావడంతో ఆ ఇద్దరు మహిళలు తర్వాత మాట్లాడుకున్నారు.  ఇద్దరిని ఒకేలా మోసం చేసినట్లు, ఇద్దరికీ ఒకేలా చెప్పి లక్షల్లో డబ్బులు గుంజినట్లు గుర్తించారు. 

పొంగిపొర్లుతోన్న వాగులు, వంకలు : రైల్వే శాఖ అప్రమత్తం, పలు రైళ్లు రద్దు.. ఎంఎంటీఎస్ పైనా ప్రభావం

ఈ క్రమంలో రెండో మహిళ తన తమ్ముళ్లకు చెప్పి అతని మీద నిఘా పెట్టించడంతో.. ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు బయటపడింది. ఈ విషయం నిలదీయడంతో తర్వాత అతను కనిపించడం మానేసాడు. ఈ ఇద్దరూ కలిసి మరిన్ని వివరాలు ఆరా తీయగా తమతో కలిసి మొత్తం ఏడుగురిని అతను పెళ్లి చేసుకున్నట్టు తెలిసింది. తొలి వివాహం వారి గ్రామంలోనే 2018 లో జరిగింది.  తర్వాత నెలల వ్యవధిలోనే మరో మహిళను వివాహం చేసుకుంటూ వచ్చాడు. 

చివరిగా గత ఏప్రిల్లో ఒక అమ్మాయిని తీసుకెళ్లి పరారీలో ఉన్నాడు. అతడి మోసాలపై కేపీహెచ్బీ ఠాణాలో 2019లో ఒకరు, 2021లో మరొకరు, ఆర్ సి పురం, గచ్చిబౌలి,  అనంతపురం, ఎస్ ఆర్ నగర్ ఠాణాలలో వేరు వేరు మహిళలు ఫిర్యాదు ఇచ్చారని తెలిపారు. ఏపీ మంత్రి  అంబటి రాంబాబు తమకు దగ్గరి బంధువు అని, బీజేపీ నేత శ్రీకాంత్ సన్నిహితుడని.. వారి అండ ఉందని శివశంకర్ బాబు తరచూప్రస్తావించేవాడనివారు చెప్పారు. నిజంగా వారికి సంబంధాలు ఉంటే అతని నిజ స్వరూపం గ్రహించి దూరంగా పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios