తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుంటున్న వ్యక్తిని అసెంబ్లీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకుంటున్న వ్యక్తిని అసెంబ్లీ సిబ్బంది అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు ఆటోలో ఎక్కించి అతడిని సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. తనకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని ఆ వ్యక్తి ఆరోపించాడు. ఆ ఆవేదనతోనే ఆత్మహత్యకు యత్నించినట్టుగా చెప్పాడు. ఇక, ఈ ఘటనతో అసెంబ్లీ పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.