ఖమ్మం: ఇంట్లో పనిచేస్తున్న బాలికపై ఇంటి యజమాని కొడుకు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్ లో సుబ్బయ్య ఇంట్లో మైనర్ బాలికను ఇంట్లో పనికి పెట్టారు.

సుబ్బయ్య కొడుకు మారయ్య మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలికతో కేకలు వేసింది. అయితే ఈ విషయం బయటకు వస్తోందనే భయంతో మారయ్య ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక వీపు బాగం పూర్తిగా కాలిపోయింది. మారయ్య కుటుంబానికి చెందినవారే  ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.

వారం రోజులుగా ఖమ్మం ఆసుపత్రిలో బాలికకు చికిత్స చేయిస్తున్నారు. బాలిక వైద్య ఖర్చులను తామే భరిస్తామని మారయ్య కుటుంబం హామీ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని తొలుత బాలిక కుటుంబసభ్యులు బయటకు చెప్పలేదు. 

బాలిక పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.