‘ఒంటరి మహిళలే టార్గెట్’ నిందితుడి అరెస్ట్.. భార్య మరో వ్యక్తితో పోయిందని..దారుణాలు..
single womenలను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో పరిచయం ఉన్న సిద్దిపేట పట్టణం కెసిఆర్ నగర్ లో ఉంటున్న లక్ష్మిని తన కోరిక తీర్చలేదనే కారణంతోనే ఈ నెల 1వ తేదీన మెడకు చీర కొంగుతో ఉరి బిగించి హత్య చేశాడు.
సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో జరిగిన double murders caseలో సిద్ధిపేట టూటౌన్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. సిద్దిపేట టు టౌన్ సిఐ పరశురామ్ గౌడ్, త్రీ టౌన్ సిఐప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన షేక్ షాబుద్దీన్ (43) కలాయి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
గతంలో తన మొదటి భార్య మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని, ఈ విషయంలో వారి బంధువుల్లో ఇద్దరి ప్రమేయం ఉందని అనుమానించి.. వారిని murder చేసిన కేసులో 2006లో Life imprisonment పడి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రెండు నెలల క్రితం షేక్ షాబుద్దీన్ బెయిల్ పై బయటికి వచ్చాడు.
single womenలను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో పరిచయం ఉన్న సిద్దిపేట పట్టణం కెసిఆర్ నగర్ లో ఉంటున్న లక్ష్మిని తన కోరిక తీర్చలేదనే కారణంతోనే ఈ నెల 1వ తేదీన మెడకు చీర కొంగుతో ఉరి బిగించి హత్య చేశాడు.
అదే రోజు రాత్రి గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మర్కూర్ మండలానికి చెందిన స్వరూప.. స్థానిక అంబేద్కర్ విగ్రహం పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఉండగా మద్యం మత్తులో షాబుద్దీన్ తన కోరిక తీర్చాలని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఆమెను రాయితో నుదిటిపై కొట్టి హత్య చేశాడు.
ఈ రెండు ఘటనల పై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న కల్లు కాంపౌండ్ లోకి కల్లు తాగడానికి నిందితుడు రావడంతో సిద్దిపేట టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా, రెండు హత్య వివరాలు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి నుంచి దొంగిలించిన రెండు సెల్ఫోన్లను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. షేక్ షాబుద్దీన్ ను అరెస్ట్ చేసి, జుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
దళిత బాలికపై అత్యాచారం.. ‘జీవితాంతం జైల్లోనే..’ ఉంచాలని తీర్పునిచ్చిన కోర్టు...
ఇదిలా ఉండగా, ఖమ్మం నగరంలోని ప్రశాంతి నగర్ కు చెందిన ఓ married woman పై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు పై ఆదివారం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ రామకృష్ణ కథనం ప్రకారం వివాహిత తనింట్లో స్నానం చేస్తుండగా ఇంటి పక్కనే ఉండే యువకుడు ప్రవీణ్ తన సెల్ ఫోన్ లో ఆమె నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు. ఆ తరువాత ఆమెకు వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా లొంగదీసుకున్నాడు.
ఇదే అదనుగా అతని సోదరుడు గిరిధర్ కూడా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తనపై లైంగిక దాడి చేశారని, వేధింపులకు పాల్పడుతూ కులం పేరుతో దూషించారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు. ఏ సి పి ఆంజనేయులు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.