Asianet News TeluguAsianet News Telugu

దళిత బాలికపై అత్యాచారం.. ‘జీవితాంతం జైల్లోనే..’ ఉంచాలని తీర్పునిచ్చిన కోర్టు...

2018 లో 13 ఏళ్ల బాలికపై ఎడ్ల రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుల సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  సైఫాబాద్  ఏసిపి వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  విచారణ చేపట్టి నిందితులపై ఫోక్సో,  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Hyderabad : Man gets lifer for rape, metropolitan sessions court verdict
Author
Hyderabad, First Published Oct 13, 2021, 7:23 AM IST

ఖైరతాబాద్ :  మూడేళ్ల క్రితం సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో dalit girlపై జరిగిన molestation కేసులో నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.  నిందితుడు ఎడ్ల రమేష్ (45) పై ఆరోపణలు నిర్ధారణ కావడంతో.. అతన్ని జీవితాంతం జైలులోనే ఉంచాలని అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  దాంతోపాటు 20 వేల జరిమానా విధించింది.  ఈ కేసులో మంగళవారం అదనపు Metropolitan Sessions Court న్యాయమూర్తి బి సురేష్ 22 పేజీల తీర్పును ఇచ్చారు.

2018 లో 13 ఏళ్ల బాలికపై ఎడ్ల రమేష్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.  ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుల సంఘాల వారు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.  సైఫాబాద్  ఏసిపి వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో  విచారణ చేపట్టి నిందితులపై ఫోక్సో,  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ లతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

బాధితురాలికి ఏడు లక్షల రూపాయలు Compensation ప్రభుత్వం నుంచి ఇప్పించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది.  ఆ డబ్బులు 80 శాతం ఆమె పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని 20 శాతం నగదును ఆమెకు అందజేయాలని ఆదేశించింది.  దోషికి విధించిన జరిమానా పరిహారం రెండు నెలల్లోగా చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కేసీఆర్ పెద్దమనసు.. యువతి వైద్యానికి రూ.25 లక్షల సాయం

అయితే ఈ కేసులో ఆలస్యంగానైనా  బాధితురాలికి  కొంత న్యాయం జరిగిందని జరిగిందని ఈ తీర్పు విన్న వాళ్లు  హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి శిక్షణ వల్ల నిందితుల్లో కాస్తయినా భయం వస్తుందని... మరోసారి ఇలాంటి వాటికి పాల్పడకుండా ఉంటారని ఆశిస్తున్నారు. మరికొందరు మాత్రం  ఎన్ కౌంటర్లు చేసినా, ఇంతటి కఠిన శిక్షలు విధించినా.. కూడా ఇలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండలేకపోతున్నారని.. ప్రతీరోజూ ఏదో ఒక చోట.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమాజంలో, మనుషుల భావాజాలాల్లో మార్పులు రానంతవరకు బాలికపై జరగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతాయే తప్ప తగ్గవని.. ఇలాంటి మృగాళ్ల బారినుంచి ఆడపిల్లల్ని కాపాడుకోవడం కష్టంగా మారిపోందని తల్లులు బాధను వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios