Asianet News TeluguAsianet News Telugu

శంషాబాద్‌కు బాంబు బెదిరింపు: స్నేహితుడిని కెనడా వెళ్లకుండా ఆపేందుకే..!!

శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ మంగళవారం సాయంత్రం మెయిల్ చేసిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన కారణం విని పోలీసులు షాక్‌కు గురయ్యారు

man arrest for sending bomb threatening mail to shamshabad airport
Author
Hyderabad, First Published Sep 4, 2019, 8:11 PM IST

శంషాబాద్ విమానాశ్రయాన్ని పేల్చేస్తామంటూ మంగళవారం సాయంత్రం మెయిల్ చేసిన ఆగంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చెప్పిన కారణం విని పోలీసులు షాక్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే.. సాయిరాం, శశికాంత్ మిత్రులు.... గత కొన్ని రోజులుగా కెనడాకు వెళ్లేందుకు సాయిరాం ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇది నచ్చని శశికాంత్...సాయిరాంను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు.

ఈ క్రమంలో బుధవారం సాయిరాం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మీదుగా కెనడాకు వెళ్లాల్సి వుంది. ఈ విషయం తెలుసుకున్న శశికాంత్.. ఎయిర్‌పోర్ట్‌ను పేల్చేస్తానంటూ సాయిరాం పేరిట.. విమానాశ్రయ అధికారులకు మెయిల్ చేశాడు. దీంతో సీఐఎస్ఎఫ్, పోలీసులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

బాంబు జాడ లేదని నిర్థారించుకుని ఆకతాయి పనిగా తేల్చారు. ఆగంతకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి.. శశికాంత్‌ను అరెస్ట్ చేశారు.  దీనిపై సాయిరాం సైతం రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 

శంషాబాద్‌కు బాంబు బెదిరింపు: రేపు ఎయిర్‌పోర్ట్ పేల్చేస్తానంటూ మెయిల్

Follow Us:
Download App:
  • android
  • ios