శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. ‘‘ఐ వాంట్ టూ బ్లాస్ట్ ఎయిర్‌పోర్ట్ టుమారో’’ అంటూ గుర్తు తెలియని ఆగంతకుడి నుంచి మెయిల్ వచ్చింది.

దీంతో అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, పోలీసులు విమానాశ్రయంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మెయిల్ పంపిన వ్యక్తిని సాయిరామ్ కాలేరుగా గుర్తించి.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ పరిణామాలతో శంషాబాద్ విమానాశ్రయంలో కాసేపు గందరగోళం నెలకొంది. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.