పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ నిత్య పెళ్లి కూతురు వ్యవహరం వెలుగు చూసింది. వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనుష 13 మందికి టోకరా ఇచ్చి నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వైనం ఆలస్యంగా బయటికి వచ్చింది. న్యాయం చేయలంటూ.. భర్త పోలీసులను ఆశ్రయించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ నిత్య పెళ్లి కూతురు బండారం బయటపడింది. ఆమె ఒకటి కాదు, రెండు కాదు.. 13 మందికి టోకరా ఇచ్చి నాలుగు పెళ్లిళ్లు చేసుకుంది. నాలుగో భర్తతో తొలుత వైవాహిక జీవితం సాగిన.. నిత్యం భర్తను వేధింపులకు గురి చేస్తూ.. అతడ్ని మానసికంగా చిత్రహింసలకు గురిచేసింది. అంతటితో ఆగకుండా.. అత్తగారి ఇంటి నుంచి బంగారం, నగదుతో పరార్ అయ్యింది. కొన్ని రోజుల తరువాత భర్తకు ఫోన్ చేసి.. హైదరాబాద్ కు రప్పించి.. స్నేహితులతో గదిలో బంధించి కొట్టించింది. పదిలక్షలు ఇవ్వకుంటే.. భర్త పర్సనల్ వీడియోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరింపులకు పాల్పడింది. భార్యను తనకు ప్రాణభయం ఉందని... తనకు న్యాయం చేయాలంటూ సదరు భర్త పోలీసులను ఆశ్రయించారు. 

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన మెండే అనుష కు గోదావరిఖని ఎన్టీపీసీకి చెందిన సుద్దాల రేవంత్ లకు షాదీ డాట్ కామ్ లో పరిచయం ఏర్పడింది. ఇరువురి అభిప్రాయాలు కలవడంతో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. రెండు నెలలు పాటు వారి వైవాహిక జీవితం సజావుగానే సాగింది. ఆ తర్వాత అనుష విశ్వరూపాన్ని బయట పెట్టినట్లు సుద్దాల రేవంత్ తెలిపాడు. అనూషకు మద్యం, సిగరెట్ అలవాటు ఉందనీ, తనకు ఇప్పించాలంటూ ప్రతి రోజు గొడవ చేసేదన్నారు. 

నిత్యం వేధింపులకు గురి చేస్తూ గొడవలు పడేదనీ, గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడేదని ఆరోపించారు. గత నెల తన బంధువుల ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి.. అనూష నాలుగు తులాల బంగారం, 70 వేల నగదు పట్టుకుని పరార్ అయ్యిందనీ, ఫోన్ చేస్తే సరిగా స్పందించలేదని రేవంత్ చెప్పారు. కానీ, గత వారం తన భార్య ఫోన్ చేసి.. తనను హైదరాబాద్ కు రమ్మని పిలుపించుకుందనీ, ఈ క్రమంలో తన స్నేహితులతో గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసిందనీ, తనకు పది లక్షలు ఇవ్వాలని లేకపోతే.. తన పర్సనల్ వీడియోలను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతుందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన స్నేహితులు, బంధువుల ద్వారా తెలుసుకోక.. అనూషకు గతంలోనే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయనీ, వారి కూడా తన అలాగే.. బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాగిందని రేవంత్ ఆరోపించారు. అనూష నుండి తనకు ప్రాణభయం ఉందని,తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించినట్లు రేవంత్ తెలిపారు.