సంక్షేమ పథకాల నుంచి బీఆర్ఎస్ నేతలకు కమీషన్లు.. కేసీఆర్ ను టార్గెట్ చేసిన మైనంపల్లి

Hyderabad: అధికార పార్టీ బీఆర్ఎస్ లో నియంతృత్వం కొనసాగుతున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేసిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, అనేక నాటకీయ పరిణామాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి టిక్కెట్టు కేటాయింపు విషయం పై అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు రోహిత్‌కు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. 

Malkajgiri MLA Mynampally Hanumantha Rao targeted CM KCR RMA

Malkajgiri MLA Mynampally Hanumantha Rao: అధికార పార్టీ బీఆర్ఎస్ లో నియంతృత్వం కొనసాగుతున్నదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్ రావు (కేసీఆర్) ను టార్గెట్ చేసిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, అనేక నాటకీయ పరిణామాల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు టిక్కెట్టు కేటాయింపు విషయం పై అసంతృప్తితో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన కుమారుడు రోహిత్‌కు బీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంపై ఆయన మండిపడ్డారు. 

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ లో చేరిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు  హైదరాబాద్ కు తిరిగి రాగానే ఆయన మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. ఒకటి తనకు, మరొకటి తన కుమారుడు రోహిత్ రావుకు రెండు పార్టీ టిక్కెట్లు కావాలన్న తన అభ్యర్థనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అంగీకరించకపోవడంతో ఆయన బీఆర్ఎస్ ను వీడాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ హామీ ఇవ్వడంతో హస్తం కండువా కప్పుకున్నారు. మధ్యాహ్నం ఆర్జీఐ విమానాశ్రయంలో దిగిన హనుమంతరావు అధికార బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల నుంచి పార్టీ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు.

బీఆర్ఎస్ లో నియంతృత్వం.. 

అసమ్మతి స్వరాలను అణచివేసే నియంతృత్వ పాలనలో రాష్ట్రం ఉందని హనుమంతరావు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన పునరుద్ధరించి నియంతృత్వ పాలన అంతమయ్యే వరకు పోరాడుతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. తనను పలకరించడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన తన మద్దతుదారులకు పోలీసులు అడ్డంకులు సృష్టించారని హనుమంతరావు విమర్శించారు. తన మద్దతుదారులు ఎక్కడికి వెళ్లకుండా పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి విమానాశ్రయానికి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అలాగే, ఐటీ కంపెనీలను హైదరాబాద్ కు తీసుకువచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిరసనలను నిషేధించడం శోచనీయమని హనుమంతరావు అన్నారు.

కాంగ్రెస్ ను వీడిన మేడ్చల్ నేత..

మరోవైపు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉంది. మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు కాంగ్రెస్ లో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కించుకోవాలని శ్రీధర్ ఎప్పటి నుంచో ప్రయత్నించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios