అజహరుద్దీన్ కు ఊరట: హెచ్‌సీఏ నిధుల గోల్‌మాల్‌లో ముందస్తు బెయిలిచ్చిన కోర్టు

హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, అజహరుద్దీన్ కు  కోర్టులో ఊరట లభించింది.ఉప్పల్ లో  నమోదైన కేసులకు సంబంధించిన  అజహరుద్దీన్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 Malkajgiri Court Grants Anticipatory Bail  to  azharuddin  lns

హైదరాబాద్: మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ కు  మల్కాజిగిరి కోర్టు  సోమవారంనాడు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన  నాలుగు కేసులకు సంబంధించి  మల్కాజిగిరి కోర్టులో  అజహరుద్దీన్  ముందస్తు బెయిల్ ను కోరారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న  మల్కాజిగిరి కోర్టు  అజహరుద్దీన్ కు  ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చి  అజహరుద్దీన్ ను విచారించాలని  మల్కాజిగిరి కోర్టు ఆదేశించింది.  మరో వైపు విచారణకు సహకరించాలని కూడ  కోర్టు అజహరుద్దీన్  కోరింది. 

హెచ్ సీఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్ పై  జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు  కమిటీ నాలుగు కేసులు పెట్టింది.  2020 నుండి  2023 వరకు  హెచ్‌సీఏ నిధుల గోల్ మాల్ పై   నాగేశ్వరరావు కమిటీ ఆడిట్ నిర్వహించింది.  ఈ ఆడిట్ లో  భారీ గోల్ మాల్ జరిగిందని కమిటీ గుర్తించింది.  కొనుగోలు పేరుతో  హైద్రాబాద్ క్రికెట్  అసోసియేషన్ కు  రూ. 57 లక్షలు నష్టం జరిగిందని నాగేశ్వరరావు కమిటీ గుర్తించింది.   అంతేకాదు  బకెట్ సీట్లు, ఫైర్ ఫైటింగ్ పరికరాల కొనుగోలులో  నష్టం వచ్చిందని కూడ కమిటీ గుర్తించింది.  మరో వైపు జిమ్ పరికరాల పేరుతో  రూ. 1.53 కోట్లు దుర్వినియోగం చేశారని కమిటీ తేల్చింది.

నిధుల గోల్ మాల్ పై  హెచ్ సీ ఏ మాజీ అధ్యక్షుడు అజహరుద్దీన్ సహా మరికొందరిపై  ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. బంజారాహిల్స్  నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా అజహరుద్దీన్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే   ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులతో ఇబ్బంది అని అజహరుద్దీన్ భావించారు. దీంతో  మల్కాజిగిరి కోర్టులో  ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.  

వాస్తవానికి ఇవాళ అజహరుద్దీన్ జూబ్లీహిల్స్ నుండి నామినేషన్ దాఖలు చేయాలని భావించారు. కానీ, మల్కాజిగిరి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత నామినేషన్ వేయాలని  నిర్ణయించుకున్నట్టుగా  ప్రచారం సాగుతుంది. ఇవాళ సాయంత్రం మల్కాజిగిరి కోర్టు  అజహరుద్దీన్ కు  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.  జూబ్లీహిల్స్ నుండి  అజహరుద్దీన్ కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వడంతో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడారు.  బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios