Asianet News TeluguAsianet News Telugu

అది ఎన్నిసార్లు ఆగిపోయిందో.. ఆటోలో వెళ్లా, బుల్లెట్ ప్రూఫ్ కారు పనితీరుపై రాజాసింగ్ వ్యాఖ్యలు

ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కారుపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కారు వల్ల తాను ఎన్ని సార్లు ఇబ్బందులకు గురయ్యానో అంటూ తెలిపారు. 
 

mal raja singh angryover bullet proof car
Author
First Published Nov 14, 2022, 3:51 PM IST

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ కార్‌కు విపరీతంగా రిపేర్లు వస్తున్నాయని అన్నారు. ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రాణహానీ వున్న నేపథ్యంలో తనకు రిపేర్లు వున్న బుల్లెట్ ప్రూఫ్ కారును సమకూర్చారని రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారు వల్ల తాను ఎన్ని సార్లు ఇబ్బందులకు గురయ్యానో అంటూ తెలిపారు. 

కొద్దిరోజుల క్రితం నడిరోడ్డు మీదే బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోతే.. దానిని ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపినట్లు రాజాసింగ్ వెల్లడించారు. తర్వాత రెండు నెలల క్రితం నాంపల్లి కోర్టుకు వెళ్తుండగా .. మరసారి రోడ్డుపైనే వాహనం నిలిచిపోయిందని, దీంతో భద్రతా సిబ్బంది సాయంతో ఆటోలోనే కోర్టుకు వెళ్లినట్లు ఆయన వాపోయారు. ఇటీవల అఫ్జల్‌గంజ్‌లోనూ వాహనం ఆగిపోగా.. ఇంటి నుంచి సొంత కారును తెప్పించకున్నానని రాజాసింగ్ చెప్పారు. 

ALso Read:హిందూవాదిగా కలిశా:రాజాసింగ్‌తో చీకోటి ప్రవీణ్ కుమార్ భేటీ

మరోవైపు.. రాజాసింగ్‌‌ను చీకోటి ప్రవీణ్ కుమార్ శుక్రవారం నాడు కలిసిన సంగతి తెలిసిందే. 77 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన  రాజాసింగ్ ను పరామర్శించేందుకు వచ్చినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పారు. బెయిల్ పై రాజాసింగ్  రెండు రోజుల క్రితం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు.రాజాసింగ్ ను ఆయన ఇంట్లో ప్రవీణ్ కుమార్ కలిశారు.  హిందూవాదిగా తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పారు.10 ఏళ్ల క్రితం తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా  గుర్తు చేసుకున్నారు.పీడీ యాక్టుపై జైల్లో ఉన్న రాజాసింగ్ కు నైతిక మద్దతుఇచ్చేందుకు తాను ఇక్కడికి చచ్చినట్టుగా ఆయన తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios