హిందూవాదిగా కలిశా:రాజాసింగ్‌తో చీకోటి ప్రవీణ్ కుమార్ భేటీ
హిందూవాదిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను కలిసినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పారు.రాజాసింగ్ కు తాను నైతిక మద్దతిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
హైదరాబాద్:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను చీకోటి ప్రవీణ్ కుమార్ శుక్రవారంనాడు కలిశారు. 77 రోజుల తర్వాత బెయిల్ పై విడుదలైన రాజాసింగ్ ను పరామర్శించేందుకు వచ్చినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పారు. బెయిల్ పై రాజాసింగ్ రెండు రోజుల క్రితం చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు.రాజాసింగ్ ను ఆయన ఇంట్లో ప్రవీణ్ కుమార్ కలిశారు. హిందూవాదిగా తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా చీకోటి ప్రవీణ్ కుమార్ చెప్పారు.10 ఏళ్ల క్రితం తాను రాజాసింగ్ ను కలిసినట్టుగా గుర్తు చేసుకున్నారు.పీడీ యాక్టుపై జైల్లో ఉన్న రాజాసింగ్ కు నైతిక మద్దతుఇచ్చేందుకు తాను ఇక్కడికి చచ్చినట్టుగా ఆయన తెలిపారు.
రాజాసింగ్ కు తాను మద్దతుగా ఉంటానన్నారు. బలవంతంగా మతమార్పిడులకు పాల్పడే ముఠాలపై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఎవరైనా తమ ఇష్టంతో మతం మారితే తప్పులేదన్నారు.కానీ బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే హైద్రాబాద్ నగరంలోని ఏదో ఒక సెగ్మెంట్ నుండి పోటీ చేస్తానన్నారు.సిరిసిల్ల నుండి తాను పోటీచేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదన్నారు.పేదలకు సేవచేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వస్తానన్నారు. ఇప్పటికైతే ఆ ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు.తన స్టోరీని రామ్ గోపాల్ వర్మ అడిగారన్నారు. ఆర్జీవీ అడిగితే సినిమాలో నటిస్తానని చెప్పారు.తన స్టోరీ ఆధారంగా తీసే సినిమాలో ఆర్జీవీ అడిగితే నడుస్తానని ఆయన చెప్పారు.