Telangana: తెలంగాణ సర్కారు మెరుగైన పాలన అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత, సాధికారత విషయంలో తెంగాణ అగ్రగామిగా ఉందని చెప్పడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో మెరుగైన.. సుపరిపాలన అందిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) అన్నారు. మహిళా దినోత్సవాన్ని గుర్తు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురింపించారు. WomensDay2022 (మహిళా దినోత్సవం) రావడానికి మరో మూడు రోజులు మాత్రమే ఉందని తెలిపిన కేటీఆర్.. మహిళల కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, భద్రత & సాధికారత విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు.
ట్విట్టర్ స్పందించిన మంత్రి కేటీఆర్.. WomensDay2022 (మహిళా దినోత్సవం) రావడానికి మరో మూడు రోజుల సమయం మాత్రమే ! ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మహిళల సంక్షేమం, భద్రత & సాధికారత విషయంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను.. మహిళల కోసం తీసుకువచ్చిన గొప్ప చర్యల్లో కేసీఆర్ కిట్స్ ! అంటూ ట్వీట్ చేశారు. మహిళా బంధు కేసీఆర్ అని పేర్కొంటూ హాష్‌ట్యాగ్ జోడించారు.
ప్రసవ అనంతరం తల్లిబిడ్డలకు అవసరమైన 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌తో పాటు ఆర్థిక ప్రయోజనం అందిస్తున్నామని తెలిపారు. ఆడ బిడ్డ పుడిగే ₹13,000 రూపాయలు.. మగ బిడ్డకు ₹12,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి చేర్చడానికి అమ్మ ఒడి వాహనాల్లో ఇంటి వద్ద దింపుతున్నారని చెప్పారు. ఇలాంటి వాహనాలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో తీసుకువచ్చామని తెలిపారు. కేసీఆర్ కిట్ల కారణంగా సంస్థాగత డెలివరీలు 22% పెరిగాయని పేర్కొన్నారు. MMR (తల్లి మరణాల రేటు) 92 నుండి 63కి తగ్గిందనీ, ఇది జాతీయ సగటు కంటే చాలా మెరుగైన స్థితిలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో IMR (శిశు మరణాల రేటు) 39 నుండి 23కి తగ్గిందనీ, ఇది జాతీయ సగటు 42 శాతంగా ఉందని తెలిపారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ చర్యల్లో ఒకటైన #KCRKit, #TriumphantTelangana తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 13,30,000 మంది లబ్ధిదారులను చేరుకుందని ప్రకటించడానికి గర్వపడుతున్నాను ! అని కేటీఆర్ పేర్కొన్నారు.
