కల్వకుంట్ల కవిత వినూత్నంగా బర్త్ డే విషెస్: మహేష్ బాబు వీడియో ఇదీ

Mahesh babu supports Klavkuntla Kavitha
Highlights

ప్రిన్స్ మహేష్ బాబుకు నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు వినూత్నంగా జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.  మహేశ్‌బాబు ఆగస్టు 9న తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. 

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబుకు నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు వినూత్నంగా జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు.  మహేశ్‌బాబు ఆగస్టు 9న తన 43వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఇటీవల తెలంగాణ ఐటీ మంత్రి కే.తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా కవిత #సిస్టర్స్‌‌ఫర్‌ఛేంజ్‌ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
"ఈ రాఖీ పండుగ రోజు అమ్మాయిలు తమ సోదరులకు రాఖీలు కట్టే సందర్భంగా వారికి ఓ హెల్మెట్‌ని బహుమానంగా ఇవ్వాలని, అంతేకాక.. దాన్ని తప్పకుండా ధరించమని చెప్పాలి" అని చెప్పారు.  ఈ కార్యక్రమానికి మహేశ్ మద్దతుగా నిలిచారు. 

మహేష్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తున్న వీడియోను కవిత తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. "హ్యాపీ బర్త్‌డే మహేశ్‌బాబు గారు. బెస్ట్ విషెస్ మరియు పవిత్రమైన కారణం కోసం ప్రారంభించిన #సిస్టర్స్‌‌ఫర్‌ఛేంజ్‌కి మద్దతు ఇచ్చినందుకు మనస్పూర్తిగా థ్యాంక్స్. ఈ వీడియోని కొంతమందైనా ఆదర్శంగా తీసుకొని హెల్మెట్లు గిఫ్ట్‌గా ఇచ్చి ప్రాణాలు కాపాడుతారని అనుకుంటున్నా" అని కవిత వ్యాఖ్యానించారు.
 
ఈ వీడియోలో మహేశ్ మాట్లాడుతూ - "మన దేశంలో జరిగే యాక్సిడెంట్స్‌లో రోజుకి 28 మంది హెల్మెట్లు పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారు. అంటే 28 కుటుంబాలు వాళ్లు ప్రేమించే మనుషులను కోల్పోతున్నారు. జస్ట్ ఒక చిన్న కేర్‌లెస్‌నెస్ వల్ల. ఇట్స్ టైం ఫర్ ఏ ఛేంజ్. ఈ రక్షా బంధన్‌కి మీ అన్నయ్యకి, తమ్ముడికి రాఖీతో పాటు ఓ హెల్మెట్‌ని గిఫ్ట్‌గా ఇవ్వండి. తప్పకుండా పెట్టుకోమని చెప్పండి. లైఫ్ సేఫ్ ఇజ్ ఏ ఫ్యామిలీ సేఫ్. సిస్టర్స్‌ ఫర్ ఛేంజ్" అంటూ చెప్పారు. 

 

loader