ఎగబడిన మహేష్ బాబు ఫ్యాన్స్: తొక్కిసలాట, ఉద్రిక్తత

Mahesh Babu fans cause chaos, policeman, woman injured in stampede
Highlights

తెలుగు సినీ హీరో మహేష్ బాబు అభిమానులు చేసిన హల్ చల్ తో హైదరాబాదులోని కూకట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగింది. 

హైదరాబాద్: తెలుగు సినీ హీరో మహేష్ బాబు అభిమానులు చేసిన హల్ చల్ తో హైదరాబాదులోని కూకట్ పల్లిలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగింది. ఇందులో ఓ పోలీసుతో పాటు ఓ మహిళ గాయపడింది. కూకట్ పల్లిలో టెక్స్ టైల్ స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఆదివారం ఉదయం కూకట్ పల్లిలోని వై జంక్షన్ ప్రధాన రహదారిపై గల టెక్స్ టైల్ షోరూంకు మహేష్ బాబు వచ్చాడు. ఆయనను చూడడానికి వేయి మందికి పైగా అభిమానులు ఎగబడ్డారు. 

కూకట్ పల్లి పోలీసులు భారీగా పోలీసు బలగాలను మోహరించినప్పటికీ వారిని నియంత్రించడం కష్టమైంది. మహేష్ బాబు ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదిక వైపునకు అభిమానులు దూసుకుని వచ్చారు. 

దూరం నుంచి తమ హీరోను చూడడానికి అభిమానులు చేసిన ప్రయత్నం చేశారు. క్రమంగా వేదికవైపునకు దూసుకు రావడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఓ మహిళ కింద పడిపోయి స్పృహ తప్పింది. ఆమెకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు.

ఇదిలావుంటే, విధుల్లో ఉన్న కెపిహెచ్ బీ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ ఎ. వెంకటేశం గాయపడ్డారు. ఇనుప స్తంభం ఆయన భుజంపై పడి గాయమైంది. 

loader