బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు ...   

బిజెపి ఎమ్మెల్యేలు రాజా సింగ్, నితీష్ రాణే లపై పోలీసులు కేసులు నమోదు చేసారు. విద్వేషాలు సృష్టించే ప్రసంగించారంటూ వీరిపై కేసులు పెట్టారు షోలాపూర్ పోలీసులు. 

Maharashtra police filed a cases on BJP MLAs Raja Singh and Nitish Rane AKP

మహారాష్ట్ర : తెలంగాణ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పై  మహారాష్ట్రలో పోలీస్ కేసు నమోదయ్యింది. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారంటూ గోషామహల్ ఎమ్మెల్యేపై షోలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసారు. మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ రాణే తనయుడు, ఎమ్మెల్యే నితీష్ రాణేపై కూడా పోలీస్ కేసు నమోదయ్యింది. 

వివరాల్లోకి వెళితే... గత శనివారం షోలాపూర్ లోని రాజేంద్ర చౌక్ నుండి కన్నా చౌక్ వరకు హిందూ జన ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించారు. ఇందులో బిజెపి ఎమ్మెల్యేలు నితీష్ రాణే, రాజా సింగ్ తో పాటు సకల హిందూ సమాజ్ నేతలు, స్థానిక ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా బిజెపి   ఎమ్మెల్యేలు విద్వేషపూరిత ప్రసంగం చేసినట్లుగా ఆరోపణలు రావడం, ఫిర్యాదులు అందడంలో జైల్ రోడ్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. ఐపిసి  153A, 295A సెక్షన్ల కింద ఎమ్మెల్యేలు రాజాసింగ్, నితీష్ రాణే తో సకల హిందూ సమాజ్ నాయకులపైనా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Also Read  ప్రజాపాలనలో విచిత్రం.. ఆరు గ్యారెంటీలకు 'శివయ్య' దరఖాస్తు..

రాజాసింగ్ 'లవ్ జిహాద్' గురించి అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లుగా పోలీస్ అధికారులు తెలిపారు. మరో ఎమ్మెల్యే నితీష్ రాణే జిహాదీలు, ముస్లింల ప్రార్థనా మందిరాలైన  మసీదుల కూల్చివేతపై మాట్లాడారు. ఇలా ఓ మతాన్ని టార్గెట్ చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యేల ప్రసంగం వుండటంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు షోలాపూర్ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios