మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. షోలాపూర్‌కు చెందిన కార్పోరేటర్ నగేశ్‌తో పాటు ఆయన అనుచరులు, ఇతన నాయకులు బీఆర్ఎస్‌ తీర్ధం పుచ్చుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో వీరంతా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. షోలాపూర్‌కు చెందిన కార్పోరేటర్ నగేశ్‌తో పాటు ఆయన అనుచరులు, ఇతన నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారందరికీ కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు బాల్కసుమన్, జీవన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.