మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ఫోర్జరీ వ్యవహారంలో కోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రశాంత్ గోయెల్, అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. 

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ ఫోర్జరీ వ్యవహారంలో కోర్ట్ ఆదేశాల మేరకు సీఈసీపై కేసు నమోదు చేశారు మహబూబ్ నగర్ పోలీసులు. సీఈసీ కేసు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఇప్పటికే ఢిల్లీ వెళ్లొచ్చారు. ఈ కేసు వ్యవహారం తేల్చేందుకు ఢిల్లీ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమీషనర్‌లు ధర్మేంద్ర శర్మ, మనోజ్ సాహు హైదరాబాద్‌కు వచ్చారు.

ఎఫ్ఐఆర్‌పై స్టేట్ సీఈవో వికాస్ రాజ్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్‌లతో చర్చించారు. ఈ కేసులో అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రశాంత్ గోయెల్, అప్పటి కలెక్టర్ రోనాల్డ్ రాస్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. వీరితో పాటు అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ ఆర్డీవో డిప్యూటీ కలెక్టర్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.