షాద్‌నగర్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కేశంపేట మండలంలోని తొమ్మిదిరేకుల గ్రామంలో  ఓ ప్రేమ జంట సోమవారం నాడు ఆత్మహత్య చేసుకొంది. వీరిద్దరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

Also read:ప్రియాంక రెడ్డి హత్య: నాడు వరంగల్‌లో ఎన్‌కౌంటర్, నేడు సజ్జనార్ ఏం చేస్తారు?

తొమ్మిదిరేకుల గ్రామానికి చెందిన 21 ఏళ్ల శ్రీరామ్ అదే గ్రామానికి చెందిన  సుశీలను ప్రేమించాడు. వీరిద్దరి ప్రేమ విషయం రెండు కుటుంబాల పెద్దలకు తెలిసింది. అయితే  వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.  దీంతో మనస్తాపానికి గురైన శ్రీరామ్ ఈ నెల 1వ తేదీన ఆత్మహత్య చేసుకొన్నాడు.  ఈ విషయం తెలిసిన  తర్వాత సుశీల కూడ విషాదంలో మునిగింది.

Also read:వెటర్నరీ డాక్టర్ రేప్, హత్య కేసు: నిందితులు వెనక్కి వచ్చి చూసి....

శ్రీరామ్ మరణించిన విషయం తెలిసిన తర్వాత అదే బాధతో సుశీల కూడ సోమవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది. ఓకే గ్రామానికి చెందిన ఇద్దరు ఆత్మహత్యలకు పాల్పడడంతో విషాద చాయలు నెలకొన్నాయి.