ఆదివారం కావడం అందులోనూ బోనాల ఉత్సవాలు మొదలు కావడంతో ఆ కుటుంబం బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు వెళ్లింది. మహిమ గల తల్లిని దర్శించుకుని మొక్కులు మొక్కుకునేందుకు బైక్ మీద పాపతోపాటు తల్లిదండ్రులు బయలుదేరారు. కానీ విధి వక్రీకరించింది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు దరి చేరింది.

కూకట్‌పల్లి వివేకానందనగర్‌లో ఆదివారం ఉదయం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. భార్య, భర్త, కూతురు మృతిచెందినట్లు చెబుతున్నారు.

మృతులు నరసింహరావు(45), లలిత(35), శిరీష(15)లుగా గుర్తించారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి బల్కంపేట్‌ ఎల్లమ్మ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడడంతో వారి బంధు మిత్రులు తల్లడిల్లుతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ పరారీలో ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.