Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: భక్తులు లేకుండానే భద్రాద్రి రాములోరి కళ్యాణం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే బుధవారం నాడు  నిర్వహించారు. గత ఏడాది కూడ కోవిడ్ కారణంగా భక్తులు లేకుండానే  సీతారాములకళ్యాణం నిర్వహించారు.

Lord Rama Kalynam conducts without devotees lns
Author
Bhadrachalam, First Published Apr 21, 2021, 10:48 AM IST

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి సీతారాముల కళ్యాణం భక్తులు లేకుండానే బుధవారం నాడు  నిర్వహించారు. గత ఏడాది కూడ కోవిడ్ కారణంగా భక్తులు లేకుండానే  సీతారాములకళ్యాణం నిర్వహించారు.భద్రాద్రి  సీతారాముల స్వామి వార్లకు  తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణోత్సవం కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడ పాల్గొన్నారు.కళ్యాణోత్సవ కార్యక్రమానికి  అర్చకులు, అధికారులు  ఎంపిక చేసిన వారు మాత్రమే హాజరయ్యారు.

ఈ నెల 22వ తేదీన శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహిస్తారు. భద్రాచలం ఆలయంలో రెండోసారి భక్తులు లేకుండా  స్వామివారి  కళ్యాణోత్సవం నిర్వహించారు.భద్రాచలం ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవానికి  లక్షలాది మంది భక్తులు హాజరౌతారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 6542 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మంది మరణించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20 నుండి నైట్ కర్ఫ్యూను అమలు చేస్తోంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios