లోక్ పోల్ సర్వే : తెలంగాణలో కాంగ్రెస్ జోరు.. రెండో స్థానంలో బీఆర్ఎస్, వెనకబడ్డ బీజేపీ..

తెలంగాణ రాజకీయాల్లో లోక్ పోల్ సర్వే ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఆ సంస్థ విడుదల చేసిన సర్వే ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో నిలిచింది. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. మూడో స్థానంలో ఎంఐఎం నిలవగా.. బీజేపీ వెనకబడింది.

Lok Poll Survey: Congress is strong in Telangana, BRS is second, BJP is lagging behind..ISR

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. రేపో, మాపో ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో తమ ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార బీఆర్ఎస్ దాదాపు నెల రోజుల కిందటే తన అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా తమ అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ పార్టీలు అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

7 అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి, 40 మందికి గాయాలు.. ముంబైలో ఘటన

కాగా.. ఓ వైపు పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతుండగా.. ఓ సర్వే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఆ సర్వే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతోందని తేల్చి చెప్పింది. ఇది అధికార బీఆర్ఎస్ లో టెన్షన్ కు కారణమైంది. అయితే ఈ సంస్థ గతంలో కర్ణాటక ఎన్నికల కోసం నిర్వహించిన సర్వే దాదాపుగా నిజమైంది. ఆ రాష్ట్రంలో సర్వే చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. 

ఇంతకీ ఆ సర్వే ఏం చెప్పిందంటే ? 

లోక్ పోల్ అనే సంస్థ ఈ సర్వేను చేపట్టింది. ఈ ఏడాది ఆగస్టు 10వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. తాజాగా ఆ అభిప్రాయాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ? ఆయా పార్టీలకు వచ్చే ఓటు షేర్ ఎంత అనే వివరాలను విడుదల చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 61 నుంచి 67 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే తెలిపింది. అలాగే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపడుతుందని తేల్చి చెప్పింది.

నీవు లేక నేను బతకలేనని.. ప్రాణ స్నేహితుడి ఆత్మహత్యను తట్టుకోలేక యువకుడి బలవన్మరణం..

అయితే ఈ సర్వే బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుంది పేర్కొంది. ఆ పార్టీ 45 నుంచి 51 స్థానాల్లో మాత్రమే గెలుపొందుతుందని చెప్పింది. అయితే బీజేపీ చివరి స్థానంలో నిలుస్తుందని ఆ సర్వే అంచనా వేసింది. ఆ పార్టీకి 2-3 సీట్లలో మాత్రమే గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం ఎప్పటిలాగే మూడో స్థానంలో నిలిచి, 6 నుంచి 8 సీట్లను గెలుచుకుంటుందని తెలిపారు. అయితే ఇతరులకు కేవలం 0-1 స్థానాల్లోనే విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది. 

ఓట్ షేర్ పరంగా చూస్తే.. కాంగ్రెస్ 41-44 శాతం సాధించి మొదటి స్థానంలో నిలుస్తుందని లోక్ పోల్ సర్వే తెలిపింది. అలాగే అధికార బీఆర్ఎస్ కు కొంత తగ్గుతుందని, ఆ పార్టీ 39-42 శాతం ఓట్లు మాత్రమే పొందుతుందని చెప్పింది. అలాగే ఎంఐఎం 3 నుంచి 4 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుందని తేల్చి చెప్పింది. ఇతరులు కూడా 3 నుంచి 5 శాతం పొందుతారని తెలిపింది. 

కాంగ్రెస్ గ్యారెంటీ స్కీమ్ లపై ప్రజల మొగ్గు 

తెలంగాణలో కొంత కాలం కిందట కాంగ్రెస్ తన గ్యారెంటీ స్కీమ్ లను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెబుతోంది. దీంతో ఈ స్కీమ్ ల వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని లోక్ పోల్ సర్వే పేర్కొంది. అలాగే బీసీల నుంచి, మైనారిటీల నుంచి ఆ పార్టీకి మద్దతు ఎక్కువవుతోందని తెలిపింది. అదే సమయంలో వాగ్దానాల అమలులో ఫెయిల్ కావడం, స్థానిక నేతలపై పెరిగిన అసంతృప్తి బీఆర్ఎస్ పై వ్యతిరేకతకు కారణమైందని పేర్కొంది. అయితే ఎంఐఎం తన కంచుకోట అయిన పాతబస్తీలో ఓటు బ్యాంకును రక్షించుకుందని లోక్ పోల్ సర్వే ప్రకటించింది. కానీ బీజేపీలో రాష్ట్రంలో ఉన్న ఓటు బ్యాంకును కూడా నష్టపోయిందని తెలిపింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios