Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ ఉల్లంఘన: మూసి ఉన్న ఫ్లై ఓవర్ తెరిచి ఎంఐఎం ఎమ్మెల్యే హల్చల్

డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఎంఐఎం పార్టీకి చెందిన మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ.... మూసి ఉన్న ఫ్లైఓవర్ ను తెరిచారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తన అనుచరులతో కలిసి తొలిగించారు. అక్కడనుంచి వెళుతున్న ఇతర వాహనదారులను కూడా ఆ ఫ్లై ఓవర్ పై వెళ్లేందుకు అనుమతులిచ్చారు. 

Lockdown Violation: AIMIM MLA Opens Dabirpura Flyover Closed in the Wake of Coronavirus
Author
Hyderabad, First Published May 16, 2020, 7:56 AM IST

లాక్ డౌన్ ను సామాన్యులు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తూ, వారిపైన అక్కడే లాఠీలు ఝుళిపిస్తూ విరుచుకుపడే పోలీసులు... ప్రజాప్రతినిధులు మాత్రం తమ ఇష్టా రాజ్యంగా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నా చోద్యం చూస్తున్నారు తప్ప వారిపైన ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. 

పాతబస్తీ, డబీర్ పుర ఫ్లైఓవర్ ని ఈ లాక్ డౌన్ నేపథ్యంలో మూసేసారు. ఇదొక్కటే ఫ్లై ఓవర్ కాదు, నగరంలోని అనేక ఫ్లైఓవర్లను కూడా ఈ కరోనా లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు మూసేసారు. 

నిన్న డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఎంఐఎం పార్టీకి చెందిన మలక్ పేట్ ఎమ్మెల్యే బలాల లాక్ డౌన్ ను ఉల్లంఘిస్తూ.... మూసి ఉన్న ఫ్లైఓవర్ ను తెరిచారు. అడ్డుగా ఉన్న బారికేడ్లను తన అనుచరులతో కలిసి తొలిగించారు. అక్కడనుంచి వెళుతున్న ఇతర వాహనదారులను కూడా ఆ ఫ్లై ఓవర్ పై వెళ్లేందుకు అనుమతులిచ్చారు. 

ఫ్లైఓవర్ అవతలి వైపు మూసి ఉందని తెలుసుకొని అటువైపు కూడా వెళ్లి తెరిపించాడు. ఈ తతంగం అంతా నడుస్తుండగా అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ భయంతో తన ఉన్నతాధికారులకు ఫోన్లు చేస్తూ నిశ్చేష్టుడిగా ఉండిపోయాడు. 

ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడడంపై ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. పోలీసుల పనితీరును కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీడియో సాక్ష్యం దొరికినా కేసు ఎందుకు నమోదు చేయలేదని సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు సామాన్యులు.  

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లు...  ఎల్.బి.నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో ఆక్టివ్ కేసులున్నాయని నిన్ననే కేసీఆర్ చెప్పారు. 

కంటైన్మెంట్ జోన్ మలక్ పేట్ కు డబీర్ పుర కూతవేటు దూరంలో మాత్రమే ఉంటుంది. అందునా ఆ ప్రాంతాల్లో కరోనా విస్తారంగా వ్యాప్తి చెందుతుందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ... ఇలా లాక్ డౌన్ ఉల్లంఘనలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మే 1వ తేదీన కూడా నాలుగు రెడ్ జోన్ ప్రాంతాలను మలక్ పేట్ నియోజకవర్గ పరిధిలో కూడా ఇదే ఎమ్మెల్యే గారు తెరిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios