Asianet News TeluguAsianet News Telugu

స్వగ్రామంలో తల్లి వర్ధంతికి దూరం:కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లాక్ డౌన్ కష్టాలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడ లాక్‌డౌన్ కష్టాలు తప్పలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలోనే కిషన్ రెడ్డి తన తల్లి సంవత్సరీకాన్ని సోమవారం నాడు నిర్వహించారు
lock down: union minister Kishan Reddy not attended his mother's anniversary
Author
New Delhi, First Published Apr 13, 2020, 1:42 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి కూడ లాక్‌డౌన్ కష్టాలు తప్పలేదు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఢిల్లీలోనే కిషన్ రెడ్డి తన తల్లి సంవత్సరీకాన్ని సోమవారం నాడు నిర్వహించారు.కిషన్ రెడ్డి కుటుంబసభ్యులు మాత్రం తిమ్మాపూర్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని వీడియో ద్వారా కిషన్ రెడ్డి తిలకించారు.
 

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  గత నెల రోజులుగా  న్యూఢిల్లీలోనే ఉన్నారు. కరోనా వైరస్ సహాయక చర్యల సమీక్షలు , ఇతరత్రా కార్యక్రమాల్లో ఆయన బిజీ బిజీగా ఉన్నారు. నెలరోజులుగా ఆయన మాత్రం హైద్రాబాద్ కు రాలేదు.

కిషన్ రెడ్డి తల్లి మరణించి నేటికి ఏడాది పూర్తైంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కిషన్ రెడ్డి హైద్రాబాద్ కు రాలేకపోయారు.లాక్ డౌన్ కారణంగానే కిషన్ రెడ్డి  న్యూఢిల్లీలోనే ఉండిపోయారు.

తల్లి మృతిచెంది ఏడాది పూర్తైనందున  ఢిల్లీలోనే కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వచ్చింది. మరో వైపు  కిషన్ రెడ్డి భార్యతో పాటు ఆయన కుటుంబసభ్యులు  తిమ్మాపూర్ గ్రామానికి చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తన స్వంత గ్రామంలో తల్లి సంవత్సరీకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  కార్యక్రమాన్ని వీడియో ద్వారా మంత్రి కిషన్ రెడ్డికి చూపారు కుటుంబసభ్యులు .  లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం ఇష్టం లేని కారణంగానే తాను న్యూఢిల్లీలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Follow Us:
Download App:
  • android
  • ios