Asianet News TeluguAsianet News Telugu

హెల్మెట్, మాస్క్ లేదు.. పది దాటినా రోడ్ల మీదకి: ప్రశ్నించినందుకు పోలీసులపైనే దాడి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో యువకులు రెచ్చిపోయారు. సులేమాన్ నగర్‌లో పోలీసులపై దాడి చేశారు. ఆంక్షల సడలింపు ముగిసినా రోడ్లపైకి వచ్చారు. హెల్మెట్ లేదు, కనీసం మాస్క్ కూడా లేదు. ఇదే విషయంపై నిలదీసినందుకు పోలీసులపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మా బండిని ఆపుతావా అంటూ డ్యూటీలో వున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

locals attack on police in rajendra nagar over lockdown violation ksp
Author
Hyderabad, First Published May 25, 2021, 3:15 PM IST

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో యువకులు రెచ్చిపోయారు. సులేమాన్ నగర్‌లో పోలీసులపై దాడి చేశారు. ఆంక్షల సడలింపు ముగిసినా రోడ్లపైకి వచ్చారు. హెల్మెట్ లేదు, కనీసం మాస్క్ కూడా లేదు. ఇదే విషయంపై నిలదీసినందుకు పోలీసులపై రాళ్లు విసిరేందుకు ప్రయత్నించారు. మా బండిని ఆపుతావా అంటూ డ్యూటీలో వున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు లాక్ డౌన్ సమయంలో రోడ్ల మీద యదేచ్ఛగా తిరుగుతూ.. నిబంధనలు ఉల్లంఘించే వారి గురించి తెలిసిందే. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా కనిపించాయి. పాలకూర కోసమని, గోధుమ పిండి కొనడానికని, వడియాలు పెట్టడానికని... ఇలా రకరకాల పేర్లతో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారు కనిపించారు. 

తాజాగా సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో ఇలాంటి ఘటనలు కాస్త తక్కువగానే జరుగుతున్నాయని చెప్పవచ్చు. అయితే తాజాగా ఓ వ్యక్తి తిన్నది అరగడం లేదు అందుకే.. బైటికి వచ్చా అని చెప్పి పోలీసులను షాక్ చేశాడు.

Also Read:లాక్ డౌన్ : మారువేషంలో ఏసీపీ.. ఆ పోలీసులు చేసిన పని చూసి షాక్....

వివరాల్లోకి వెడితే.. ‘సార్.. ఇంట్లో ఖాళీగా కూర్చోవడంతో తిన్నది అరగడం లేదు.. మా ఇంట్లో వాళ్లందరికీ గ్యాస్ ప్రాబ్లమ్ వచ్చింది. అందుకే ఈనో ప్యాకెట్లు కొనేందుకు బయటకు వచ్చా.. ’అంటూ ఓ వ్యక్తి పోలీసులకు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీవీఆర్ చౌరస్తా వద్ద సోమవారం జరిగింది. 

లాక్ డౌన్ సమయంలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ యువకుడు బైక్ మీద వచ్చాడు. బయటకు ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో మందుల కోసం అని ఆ యువకుడు సమాధానం ఇచ్చాడు. ఏం మందులు తీసుకున్నావో చూపించమని పోలీసులు అడిగారు.

దీంతో ఆ యువకుడు బ్యాగులో నుంచి 50 ఈనో ప్యాకెట్లు తీసి చూపించాడు. ఎందుకు ఇన్ని తీసుకున్నావ్ అని అనుమానంగా ప్రశ్నించగా... లాక్ డౌన్ వల్ల తను, తన తండ్రి, సోదరుడు, భార్య ఇంట్లోనే ఉంటున్నామని, పనేం లేక తిని కూర్చోవడం వల్ల తిన్నది అరగడం లేదని.. అందుకే ఈనో ప్యాకెట్లు తీసుకుని వెల్తున్నానంటూ సమాధానం చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios