హయత్‌నగర్: నాలా కబ్జాకు గురౌతోంటే ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ స్థానికులు హయత్‌నగర్ కార్పోరేటర్ సామ తిరుమల్ రెడ్డిపై దాడికి దిగారు.

భారీ వర్షాలతో హైద్రాబాద్ జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ నెల 13వ తేదీన కురిసిన వర్షంతో నగరం ఇంకా తేరుకోలేదు. శనివారం నాడు కురిసిన వర్షంతో మరోసారి నగరం నీట మునిగింది.

also read:మూసారాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు: నీటిలోనే పలు కాలనీలు

హయత్ నగర్ డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్టలో కార్పోరేటర్  సామ తిరుమల్ రెడ్డిపై స్థానికులు దాడి చేశారు.స్థానికంగా ఉన్న నాలా కబ్జాకు గురౌతున్న పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ విషయమై కార్పోరేటర్ పై దాడికి దిగారు.ఈ నాలా కబ్జాకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఇళ్లలోకి నీరు వచ్చి చేరిందని స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు.

also read:కృష్ణా నదికి భారీ వరద: 11 ఏళ్లలో ఇదే రికార్డు

వరద నీటిలో మునిగిన ముంపు ప్రాంతాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రజా ప్రతినిధులపై  ముంపు బాధిత ప్రజలు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు.ఉప్పల్ ఎమ్మెల్యే వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.