Asianet News TeluguAsianet News Telugu

మైక్రో ఫైనాన్స్ యాప్స్ గుట్టురట్టు: సైబరాబాద్ పోలీసుల దాడులు, కేంద్రం ఇదీ..

: మైక్రో ఫైనాన్స్ యాప్స్  కు సంబంధించిన కాల్ సెంటర్లపై  దాడులు చేశారు.  దేశంలోని మూడు చోట్ల సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. 

Loan apps: Hyderabad police searches in Delhi
Author
Hyderabad, First Published Dec 21, 2020, 6:20 PM IST

హైద్రాబాద్‌: మైక్రో ఫైనాన్స్ యాప్స్  కు సంబంధించిన కాల్ సెంటర్లపై  దాడులు చేశారు.  దేశంలోని మూడు చోట్ల సైబరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. 

న్యూఢిల్లీకి సమీపంలోని గుర్‌గావ్ కేంద్రంగా మైక్రో ఫైనాన్స్ సంస్థ నిర్వాహకులు వేధింపులకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ నగరంలోని బేగంపేట, పంజాగుట్టలోని సెంటర్లలో కూడ మైక్రో ఫైనాన్స్ సంస్థ  కార్యాలయాలపై పోలీసులు దాడులు నిర్వహించారు.

గురుగ్రామ్ కేంద్రంగా నిర్వహిస్తున్న కాల్ సెంటర్ లో పనిచేస్తున్న 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. హైద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కాల్ సెంటర్ లో 700 మందిని పోలీసులు విచారించారు. 

also read:మైక్రో ఫైనాన్స్ యాప్స్‌పై ఒక్క రోజే వంద ఫిర్యాదులు: దర్యాప్తు చేస్తున్న హైద్రాబాద్ పోలీసులు

కాల్ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు ప్రతి నెల రూ. 10 వేల వేతనం ఇస్తున్నారు. ప్రతి మూడు నాలుగు మాసాలకు ఓసారి  కాల్ సెంటర్లలో పనిచేసే  ఉద్యోగులను మారుస్తున్నారు. 

ఈ మైక్రో ఫైనాన్స్ యాప్స్ వెనుక చైనా సంస్థలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.  ఈ మైక్రో ఫైనాన్స్ యాప్స్  కు సంబంధించిన సమాచారం కోసం సైబరాబాద్ పోలీసులు  గూగుల్ సంస్థకు కూడ లేఖ రాశారు.

Follow Us:
Download App:
  • android
  • ios