బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎల్. కె. అద్వానీకి  ఆదివారం నాడు భారతరత్న అందించారు రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి ఆదివారం నాడు భారత రత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.ఈ నెల 30వ తేదీన నలుగురికి రాష్ట్రపతి భవన్ లో భారతరత్న అవార్డును అందించారు.మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న అందించారు.

Scroll to load tweet…

ఇవాళ అద్వానీ ఇంటికి వెళ్లి భారతరత్నను అందించారు.ఈ ఏడాది ఐదుగురికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డులు ప్రకటించింది.అద్వానీకి భారతరత్న ప్రదానం చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా తదితరులు పాల్గొన్నారు.ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న కరాచీలో 1927, నవంబర్ 8న ఎల్ కే అద్వానీ జన్మించారు. దేశ విభజన జరగడంతో అద్వానీ కుటుంబం భారతదేశానికి వచ్చింది.