టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఫై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ క్రమంలో.. టాలీవుడ్ పరిశ్రమ..  కేటీఆర్ కి మద్దతుగా.. ట్వీట్స్ చేయడం విశేషం. అందులో.. విజయదేవర కొండ కూడా ఉండటం విశేషం.

రౌడీ హీరో, లైగర్ విజయ్ దేవరకొండ.. ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రపంచ కుబేరుల్లో ఒకరు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ని హైదరాబాద్ రావాలంటూ.. విజయదేవరకొండ ట్వీట్ చేయడం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణ పరిశ్రమల, వాణిజ్య శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేసిన ట్వీట్‌ ఒకటి చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. ప్రపంచ అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందంటూ ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన ట్వీట్ ఫై ప్రతిపక్షాలు విమర్శలు కురిపించాయి. ఈ క్రమంలో.. టాలీవుడ్ పరిశ్రమ.. కేటీఆర్ కి మద్దతుగా.. ట్వీట్స్ చేయడం విశేషం. అందులో.. విజయదేవర కొండ కూడా ఉండటం విశేషం.

Scroll to load tweet…
Scroll to load tweet…

టాలీవుడ్‌ హీరోలు విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌ సిద్ధార్థతో పాటు దర్శకుడు గోపిచంద్‌ మలినేని సైతం కేటీఆర్‌, తెలంగాణ ప్రభుత్వాల్ని ప్రశంసిస్తూనే.. టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌కి స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. నటి జెనిలీయాతో పాటు దర్శకుడు మెహర్‌ రమేష్‌ కూడా ఇందులో ఉన్నారు. ఇక ప్రముఖ జర్నలిస్టులు పంకజ్‌ పంచౌరీ, సీనియర్‌ జర్నలిస్ట్‌ విక్రమ్‌ చంద్రా సైతం ఉన్నారు