Asianet News TeluguAsianet News Telugu

కూతురిపై యేళ్ల తరబడి అత్యాచారం, గర్భవతిని చేసిన రేపిస్ట్ తండ్రికి యావజ్జీవం..

పదిహేడేళ్ల బాలికమీద కన్నేసిన సవతి తండ్రి ఆమెపై పలుమార్లు sexual assaultకి పాల్పడ్డాడు. ఈ ఘటన మీద ఈ యేడాది మార్చి 9న పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఆ బాలికకు Pregnancy వచ్చింది. 

life prison for rapist father in hyderabad
Author
Hyderabad, First Published Oct 22, 2021, 10:30 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ :  కూతురి మీదే యేళ్ల తరబడి అఘాయిత్యానికి పాల్పడి, గర్బవతిని చేసిన తండ్రికి స్థానిక కోర్టు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్ బాబా నగర్ లోని ఒక ఇంట్లో ఈ ఘోరం చోటు చేసుకుంది. 

పదిహేడేళ్ల బాలికమీద కన్నేసిన సవతి తండ్రి ఆమెపై పలుమార్లు sexual assaultకి పాల్పడ్డాడు. ఈ ఘటన మీద ఈ యేడాది మార్చి 9న పోలీసులు కేసు నమోదు చేశారు. పలుమార్లు లైంగిక దాడికి పాల్పడటంతో ఆ బాలికకు Pregnancy వచ్చింది. 

చివరికి ఆమెకు బాబు పుట్టాడు. ఈ విషయం తల్లికి తెలిసినా అడ్డు చెప్పలేదని.. కన్న కూతురిపై జరుగుతున్న అన్యాయానికి అడ్డు చెప్పలేదని.. పైగా భర్తకే వత్తాసుగా నిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

మార్చిలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. crime రుజువు కావడంతో నాంపల్లి కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. 

ఇలాంటి మరో ఘటన.. లక్నోలో ఇటీవల జరిగింది. కన్న కూతురుని కంటికిరెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై rapeకి పాల్పడ్డాడు. 

అంతటితో ఆగకుండా కాసులకు కక్కుర్తిపడి కూతురి మానాన్ని మరికొందరికి అమ్ముకున్నాడు. మానవ సంబంధాలకు మచ్చలాంటి ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. కొన్నేళ్లుగా తనపై జరిగుతున్న అకృత్యాల గురించి తాజాగా బాలిక బయటపెట్టింది. 

బాధిత బాలిక తెలిపిన వివరాలిలా ఉన్నాయి. Truck driver గా పనిచేసే తండ్రి ఆరో తరగతిలో వుండగానే బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. తల్లి ఇంట్లోలేని సమయంలో కొత్తబట్టలు కొనిపెడతానని ఒంటరిగా బయటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. 

అప్పటినుండి పలుమార్లు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసేవాడని... ఈ విషయం ఎవరికైనా చెబితే తల్లిని చంపేస్తానని బెదిరించేవాడని బాలిక తెలిపింది. అయితే రానురాను తన తండ్రి మరింత నీచానికి దిగజారాడని... డబ్బుల కోసం తనను ఇతరుల వద్దకు పంపించేవాడని తెలిపింది. 

మేనమామే కీచకుడయ్యాడు.. కవల అక్కాచెల్లెళ్లపై యేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ.. దారుణం..

ప్రతిసారీ తనను ఓ హోటల్ కు తీసుకుని వెళ్లేవాడని... అక్కడ ఎవడో ఒకడు తనపై అత్యాచారానికి పాల్పడేవాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా ఓసారి సమాజ్ వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ కూడా తండ్రితో కలిసి తన వద్దకు వచ్చాడని... అడ్డుచెబుతున్నా వినకుండా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలిక వెల్లడించింది.

ఇక అప్పటినుండి పలుమార్లు తిలక్ సోదరులు, స్నేహితులు, బందువులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత బాలిక తెలిపింది. ఇలా తన తండ్రి సాయంతో ఇప్పటివరకు దాదాపు 28మంది అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక దయనీయంగా తెలిపింది. 

17ఏళ్ల బాధిత బాలిక దయనీయ పరిస్థితి ప్రతిఒక్కరినీ కలిచివేస్తోంది. ముందు బాలిక తండ్రిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని... ఎంత పలుకుబడి వున్నా మిగతావారిని కూడా వదిలిపెట్టకూడదని డిమాండ్ వెల్లువెత్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios