Asianet News TeluguAsianet News Telugu

మేనమామే కీచకుడయ్యాడు.. కవల అక్కాచెల్లెళ్లపై యేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతూ.. దారుణం..

మేనమామ వారి పట్ల కీచకుడిగా మారి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచే sexual assault జరుగుతున్నా.. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక.. దిక్కు తోచక బాధను దిగమింగుకుని.. భరిస్తూ వస్తున్నారు. 
 

uncle molested orphaned twin daughter-in-laws in kothagudem
Author
Hyderabad, First Published Oct 22, 2021, 8:59 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

భద్రాద్రి కొత్తగూడెం : మేన కోడళ్లపై మామ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెడితే.. పన్నెండేళ్ల క్రితం parents చనిపోయిన ఇద్దరు twin sistersకి అండగా ఉంటానని మేనమా మల్ రెడ్డి క్రిష్ణారెడ్డి చేరదీశాడు.

అయితే, చేరదీయడమైతే చేరదీసాడు కానీ వారిపై కన్ను వేశాడా కామాంధుడు. వారి పట్ల కీచకుడిగా మారి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. చిన్నతనం నుంచే sexual assault జరుగుతున్నా.. ఎవరికి చెప్పుకోవాలో, ఏం చేయాలో తెలియక.. దిక్కు తోచక బాధను దిగమింగుకుని.. భరిస్తూ వస్తున్నారు. 

ఈ ఇద్దరు అక్కాచెల్లెలు..Kottagudem పట్టణంలోని ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. రోజురోజుకూ మేనమామ వేధింపులు ఎక్కువవుతుండడంతో ఇటీవల భరించలేక అక్కాచెల్లెళ్లిద్దరూ ఎదురు తిరిగారు. 

తనకే ఎదురు తిరుగుతారా అంటూ కవలలపై మేనమామ క్రిష్ణారెడ్డి చేయి చేసుకున్నాడు. అంతేకాదు విషయం బైటికి చెబితే ఆస్తి మొత్తం తీసుకుని.. ఇద్దరినీ murder చేస్తానని బెదిరించాడు. 

ఇక ఇలా ఉంటే కష్టమని.. తాము జీవితకాలం వేధింపులకు గురి కావాల్సిందేనని భావించిన అక్కాచెల్లెళ్లు కొత్తగూడెం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

వీడి ప్రేమ తగలెయ్యా.. తన ప్రపోజల్ ఒప్పుకోలేదని.. డ్రగ్స్ ప్యాకెట్ గిఫ్ట్ గా ఇచ్చి...అరెస్ట్..

మైనర్ పై వృద్ధుడి అత్యాచారం... 

కాగా, ఇలాంటి దారుణమే వరంగల్ లో ఇటీవల జరిగింది. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ (KUC) పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల మైనర్ బాలికపై రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు sexually assaultedకి పాల్పడ్డాడు.

ఈ అఘాయిత్యంతో కడుపునొప్పిని భరించలేకపోయిన బాలిక తన తండ్రికి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఉన్నత విద్య విభాగంలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అరవైతొమ్మిదేళ్ల బి బిక్షపతిని పోలీసులు అరెస్టు చేశారు. 

బిక్షపతి హనంకొండ జిల్లాలోని వడ్డేపల్లికి చెందిన పరిమళ కాలనీ రోడ్ నెం .8 లో నివాసం ఉంటున్నాడు. బాధితురాలి తండ్రి స్థానిక వైద్యుని సంప్రదించగా, బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె లైంగిక దాడి జరిగినట్లు తెలిపాడు. దీంతో అతను Kakatiya University Campus పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

బాధితురాలి తండ్రి కథనం ప్రకారం, గత మూడు రోజులుగా నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మీడియాతో మాట్లాడిన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్స్‌పెక్టర్ కె. జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడిపై "లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించాం." అని తెలిపాడు. కడుపు నొప్పి భరించలేక బాలిక తన తండ్రికి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో సంఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios