ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత కలకలం రేగింది. కుబీర్ మండలం జాంగాం అటవీ ప్రాంతంలో లేగ దూడపై దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో గ్రామస్తుల్లో ఆందోళన మొదలైంది.

ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కాలి ముద్రలను సేకరించారు. అధికారులు వెంటనే చిరుతను బంధించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. 

కాగా శనివారం నల్గొండ జిల్లాలోనూ చిరుతు కలకలం రేపింది. మల్కాపూర్ గ్రామ శివారులోని ఎఫ్‌సీఐ ఫిల్టర్ బెడ్ దగ్గర్లో చిరుత పులి అడుగులను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

దీంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా బయటకు వెళ్లొద్దనీ... తెల్లారక ముందే ఇల్లు దాటి రావొద్దనీ, సాయంత్రం వేళ చీకటి పడకముందే ఇళ్లలోకి వెళ్లిపోవాలని సూచించారు.