ఫెడరల్ ఫ్రంట్ కాదు, ఫ్యామిలీ ఫ్రంట్: కేసీఆర్ పై లక్ష్మణ్ ఫైర్

Laxman terms KCR proposed front as Family Front
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రతిపాదించేది ఫెడరల్ ఫ్రంట్ కాదని, ఫ్యామిలీ ఫ్రంట్ అని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆయన సోమవారం మీడియాతో అన్నారు. టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెసు, టీడిపి, టీఆర్ఎస్ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.

కేసీఆర్ పై రైతు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఆయన అన్నారు. టీఆర్ఎస్ మజ్లీస్ కొమ్ము కాస్తోందని, తద్వారా మతవిద్వేషాలను రెచ్చగొడుతోందని అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసిఆర్ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. 

టీఆర్ఎస్ చెల్లని రూపాయి, టీడీపీ పేలని తుపాకీ అని లక్ష్మణ్ అన్నారు. రైతుబంధు పథకం భూస్వామ్య బంధు పథకంగా మారిపోయిందని ఆరోపించారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం బీజేపీ పోరాడుతుందని చెప్పారు. అవినీతి, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ రహిత దేశాన్ని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు.

loader