హైదరాబాద్: మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు లావణ్య లహరి ఆత్మహత్య కేసులో ఆమె అత్తామామలు పరారీలో ఉన్నారు. భర్త వేంకటేశ్వర రావును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అత్త రమాదేవి, మామ మల్లాది సుబ్బారావు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న లావణ్య లహరి (32) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భర్త వెంకటేశ్వర రావు ప్రవర్తన, అతని అక్రమ సంబంధాలతో విసిగిపోయి ఆమె ఆత్మహత్య చేసుకుంది. సెల్ఫీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. 

Also Read: లేడీ టెక్కీ లావణ్య లహిరి ఆత్మహత్య: భర్త వెంకటేష్ అరెస్ట్

లావణ్య, వేంకటేశ్వ రావులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా. ఇరువురు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2012లో వివాహం చేసుకున్నారు. వెంకటేశ్వర రావు ఓ ప్రైవేట్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నాడు. ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీరు. రంగారెడ్డి జిల్లా శంషాబాదులో ని సిఎస్కే విల్లాలో ఉంటున్నారు. వారికి సంతానం కలగలేదు. 

వెంకటేశ్వర రావు కొంత కాలంగా మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. దాంతో పాటు పిల్లలు కలగడం లేదనే వేదన కూడా లహరిని వేధిస్తూ వచ్చింది. గురువారం రాత్రి ఆ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో శుక్రవారం మధ్యాహ్నం లావణ్య లహరి ఆత్మహత్య చేసుకుంది. 

Also Read: లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త

లావణ్య మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. తమ అల్లుడు ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని తండ్రి ఈశ్వరయ్య ఆరోపించారు.