హైదరాబాద్: సంచలనం సృష్టించిన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు లావణ్య లహిరి ఆత్మహత్య కేసులో ఆమె భర్త వెంకటేష్ ను ఆర్జీఐ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సెల్ఫీ వీడియో రికార్డు చేసి, దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసి లావణ్య లహిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాదు సమీపంలోని శంషాబాద్ ప్రాంతంలో ఆ సంఘటన జరిగింది. లావణ్య అత్తామామలు పరారీలో ఉన్నారు. వెంకటేష్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

భర్త అక్రమ సంబంధం కారణంగా దంపతుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. పిల్లలు పుట్టడం లేదనే సాకుతో వెంకటేష్ భార్య లావణ్య లహిరిని వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. లహిరిని వెంకటేష్ కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Also Read: లేడీ టెక్కీ ఆత్మహత్యలో విస్తుపోయే విషయాలు: నగ్నంగా అమ్మాయిల ముందు భర్త

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య లహరిని పైలట్ గా పనిచేస్తున్న వెంకటేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి మధ్య కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత వెంకటేష్ ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకోవడం కలహానికి దారి తీసింది. 

మొదటిసారి వివాహేతర సంబంధం విషయంలో పట్టుబడినప్పుడు మారుతానని చెప్పాడని, మారలేదని, రెండోసారి పట్టుబడ్డాడని, అప్పుడు కూడా మారుతానని చెప్పి మారలేదని లావణ్య సెల్ఫీ వీడియోలో ఆరోపించింది. లావణ్య తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఓ సూసైడ్ నోట్ కూడా రాసింది. తాను వెంకటేష్ ను ఎంతో ప్రేమించానని, జీవితాంతం ప్రేమించాలనేదే తన ఉద్దేశమని, అందుకే విడాకులకు దరఖాస్తు చేయలేకపోయానని ఆమె చెప్పింది.

Video: పైలట్‌ మొగుడి పైశాచికం.. లేడీ టెక్కీని చిదిమేసిన వైనం....(వీడియో)