ల్యాంకోహిల్స్ ఘటన : పోలీసులనే ఆశీర్వాదం తీసుకోమంటూ.. నిందితుడి విచిత్ర ప్రవర్తన, వికృత చేష్టలు వెలుగులోకి...

ల్యాంకోహిల్స్ ఘటనలో నిందితుడి విచిత్ర ప్రవర్తన... వికృత చేష్టలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులనే తన ఆశీర్వాదం తీసుకోమని అడిగినట్టు సమాచారం. 

Lanco Hills incident : Accused misdeeds come to light in hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మణికొండ లాంకో హిల్స్ లో బిందుశ్రీ అనే యువతి శనివారం నాడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుడైన వ్యాపారి పూర్ణచందర్రావు వికృతి చేష్టలు వెలుగులోకి వస్తున్నాయి. బిందు శ్రీ (28) అలియాస్ బేబీ ఏడేళ్ల క్రితం వ్యాపారి పూర్ణచంద్రరావు ఇంట్లో  బేబీకేర్ టేకర్ గా పనిలో చేరింది.

ఆ తరువాతి క్రమంలో పూర్ణచందర్రావు, బిందుశ్రీల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం పూర్ణచంద్రరావు కుటుంబానికి తెలియడంతో కలతలు మొదలయ్యాయి. శుక్రవారం అర్ధరాత్రి ఇదే విషయం మీద వీరిద్దరూ గొడవపడ్డారు. కాసేపటికే 21వ అంతస్థు నుంచి కిందికి దూకి బిందుశ్రీ చనిపోయింది.. అని పోలీసులు తెలిపారు. దీనిమీద ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు కేసు నమోదు చేశారు.

షేర్‌చాట్ లో పరిచయం... పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిపై అత్యాచారం..

అయితే, దీన్ని  బిందు శ్రీ కుటుంబ సభ్యులు కొట్టి పారేస్తున్నారు. వీరికి తోడు అపార్ట్మెంట్ వాసులు కూడా నిందితుడైన పూర్ణచందర్రావు వికృత చేష్టలతో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని చెబుతున్నారు. పూర్ణచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో కూడా.. పోలీసులను తన ఆశీర్వాదం తీసుకోమని చెప్పినట్లుగా తెలుస్తోంది.

గాల్లోకి చేతులు ఊపుతూ..  ఏవేవో మంత్రాలు చదువుతూ.. వింతగా ప్రవర్తించాడని పోలీసులు చెప్పారు. లాంకో హిల్స్లోకి ఏడేళ్ల క్రితం పూర్ణచందర్రావు వచ్చాడు. మొదట ఉంటున్న ఫ్లాట్ లొ నుంచి మరో ఫ్లాట్ లోకి మూడేళ్ల క్రితం మారాడు. అయితే అక్కడున్న వారెవరికీ అతను ఎవరని కానీ, ఎక్కడి నుంచి వచ్చాడని కానీ వివరాలు తెలియవు.

లాంకో హిల్స్ లో ఇలాంటి అనుమానాస్పదమరణాలు ఇది కొత్తేమీ కాదని తెలుస్తోంది. గత మూడేళ్ల కాలంలో ఈ ప్రాంగణంలో ఐదుగురు మహిళలు వివిధ కారణాలతో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఏడాది క్రితమైతే ఓ మహిళ మృతదేహం రెండు రోజులపాటు చెత్తకుండీలోనే ఉంది. ఓ వ్యాపారి ఇంట్లో పని చేసే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ మహిళ ఇంట్లో దొంగతనం చేసిందని కోపంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె మరణించినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్ని రెండు రోజులపాటు చేతకుండీలోనే ఉంచారు. ఆ తర్వాత ఆ కుటుంబం  మృతురాలి కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకుంది. వెంటనే రాత్రికి రాత్రే చెత్తకుండీలో నుండి మృతదేహాన్ని ఇతర ప్రాంతాలకు తరలించారు.  ఈ మేరకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు.

ఇక మిగిలిన నలుగురు మృతుల్లో కూడా ఇద్దరు పని మనుషులు ఉన్నారు. మరో ఇద్దరు ఐటి నిపుణులు. కాగా యువతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతని ఫ్లాట్లో నుంచి మహిళ కేకలు  వినిపించాయని ఒక మహిళ తెలిపింది. ఆమె గత ఆరేళ్లుగా అదే బ్లాక్ లో పనిచేస్తుంది. లాంకో హిల్స్ అపార్ట్ మెంట్ లో చాలావరకు ఓనర్లు ఇక్కడ ఉండరు. ప్లాట్స్ కొని అద్దెలకిచ్చి విదేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనో ఉంటున్నారు. ఇల్లు అద్దెకిచ్చే సమయంలో ఫోన్ నెంబర్,  ఊరు వివరాలు, ఆధార్ తీసుకోవాలనే కనీస నిబంధనలను పాటించడం లేదు.

ఈ ఘటనల నేపథ్యంలో మణికొండ లాంకో హిల్స్ అపార్ట్మెంట్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.  అక్కడి ఇండ్లలో పని చేసే మహిళలు తమకు రక్షణ కల్పించాలంటూ ధర్నాకు దిగారు. ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం ఈ మేరకు లాంకో హిల్స్ గేట్ దగ్గర బైఠాయించారు. బిందుశ్రీ ఆత్మహత్య ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.  అపార్ట్మెంట్ లో పనిచేసే వారికి రక్షణ కల్పిస్తామని అపార్ట్మెంట్ సంక్షేమ సంఘం నేతలు భరోసా ఇవ్వడంతో నిరసన ఆపేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios