ఈ ఫొటోలో కనబడుతున్న వాళ్లిద్దరూ లేడీ దొంగలు. మాటల్లో పెట్టి ఆడవాళ్ల నగలు, బ్యాగులు దోచుకుపోయే టైప్. వీళ్లు సంగారెడ్డి జిల్లా పరిధిలోని పఠాన్ చెరులో బస్సులో చేతివాటం ప్రదర్శిస్తూ దొరికిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు చితకబాది పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు కింద చదవండి.

పఠాన్ చేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్ స్టాండ్ లో స్థానికులు ఇద్దరు మహిళ దొంగలను పట్టుకొని చితక బాదారు. వీరిద్దరూ కేపిహెచ్ బి నుండి బస్సులో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగు నుండి లక్ష రూపాయల నగదు దోచుకొని పారిపోతుండగా పట్టుకున్నారు.

వారిని చితక బాది వారిని, డబ్బులను పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.