Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ ‘రైతే రాజు’ ప్రసంగానికి చప్పట్ల కొరత

ఆయన ప్రసంగం  రైతు చుట్టూ తిరిగింది. రైతును రాజు చేయడం, రైతుల కష్టాలు రూపు మాపడం, రైతుల కోసం  ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడం ఇలా రైతు, వ్యవసాయం మీద ఆయన సుదీర్ఘపన్యాసం చేశారు. ప్రసంగంలో  రైతే  హైలెట్ అయినా, పదివేల మంది పైగా ఉన్న ప్లీనరీలో చప్పట్లు కొరవడ్డాయి.

lack of enthusiasm over farmers welfare  in plenary irks chief minister KCR

తెలంగాణా లో రైతే రాజు అని టిఆర్ ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రటించారు. 

 

ఈ రోజు హైదరాబాద్ లో  జరిగిన తెలంగాణా రాష్ట్ర సమితి ప్లీనరీ లో మాట్లాడుతూ  తెలంగాణాలో రైతు రాజు కావాలి అని ఆయన   ప్రకటించారు. 

 

ఆయన ప్రసంగం  రైతు చుట్టూ తిరిగింది. రైతును రాజు చేయడం, రైతుల కష్టాలు రూపు మాపడం, రైతుల కోసం  ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయడం ఇలా రైతు, వ్యవసాయం మీద ఆయన సుదీర్ఘపన్యాసం చేశారు. 

 

ప్రసంగంలో  రైతే  హైలెట్ అయినా, అయిదారు వేల మంది పైగా ఉన్న ప్లీనరీలో చప్పట్లు కొరవడ్డాయి.

 

చప్పట్లేవీ అని  ఆయన పదే పదే సభికులకు గుర్తుచేయాల్సి వచ్చింది. అయినా పెద్ద గా చప్పట్లు రాకపోవడం విశేషం. వచ్చిందంతా  పార్టీ కార్యకర్తలు. అయినా, పార్టీ నేత రైతు కోసం ఒక వినూత్న పథకం, దేశంలోనే మొదటిసారి రైతుకోసం ఒక పెద్ద ప్రణాళిక  వేస్తుంటే చప్పట్లు లేవు. ప్లీనరీ పండగే తప్ప మనస క్కడలేదననే అర్థం. పూర్వంటిఆర్ ఎస్ సభల్లో పాటలు, డ్యాన్స్ లు  తెలంగాణా ఆవేశం రేకెత్తించేవి.  ఇపుడు ప్లీనరీ ఒక రాజకీయ మొక్కుబడి సమావేశం కావడం, పాత సబ్జక్టు చప్పగా ఉండటం... చివర స్పందన లేకపోవడం.

 

“రైతు రాజు కావాలి. ఎకారానికి 4 వేల పెట్టుబడి ఇస్తున్నాం. ఇదేదో  యూరియాకో, విత్తనాలకు, పురుగుల మందుకో కాదు.ఎందుకు ఖర్చు చేస్తాడో రైతు ఇష్టం. ఎకరానికి నాలుగు వేల చొప్పున ఒక పంటకి కాదు, రెండు పంటలకు ఇస్తాం. ఇది వట్టి మాటకాదు,  ఎకరానికి 4 వేలు వర్షకాలం పంటకిస్తాం. యాసంగి పంటకిస్తాం.ఇది మంచిదేనా, అమలుజరగాలి కదా,” అని అంటూ చప్పట్లు కొట్టంటి మరి ముఖ్యమంత్రి వుసిగొల్పాల్సి వచ్చింది.

 

పండ్ల తోటలకు కూడా ఎకరానికి నాలుగు వేలు ఇస్తాం అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.

 

ఈ డబ్బు ఎవరికి వెళ్తుందో కూడా ఆయన వివరంగా చెప్పారు.

 

“నాలుగు వేలు ఎవరికిస్తారని  కొంతమందిలో అనుమానాలున్నాయి. నాలుగు వేలు అందుకోవడానికి అంక్షలుంటాయా అని ప్రశ్నలొస్తున్నాయి. రాష్ట్రంలో  రైతుల కమతాలు చాలా చిన్నవి.  2.5 ఎకరాల లోపు ఉన్న రైతులు  62 శాతం ఉన్నారు. ఇక 5 ఎకరాలు ఉన్నవారు 24 శాతం ఉన్నారు.  10ఎకరాలు ఉండేవారు కేవలం 11 శాతం. 97 శాతం 10 ఎకరాలు లోపు ఉన్న  రైతులే. 3 శాతం మంది మాత్రం 25 ఎకరాలు  లోపు ఉన్నవారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు 0.28 శాతం మాత్రమే  ఉన్నారు,” అని ముఖ్యమంత్రి చెప్పారు.

 

డబ్బు పంపిణీకి ఒక వ్యవస్థ ఏర్పాటుచేస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.

 

 మధ్యలో ‘నేను చెప్పేదంతా జాగ్రత్తగా రాసుకోండి’ అని ఎమ్మెల్యేలకు గుర్తు చేశారు.

 

“ప్రతి గ్రామానికి గ్రామ రైతు సంఘం ఏర్పాటుచేస్తాం. అన్నికులాల వారు ఇందులో సభ్యులుగా ఉంటారు. గ్రామ సంఘాలతో మండల రైతు సమాఖ్య ఏర్పాటువుతుంది. వీటి సమాహారంగా జిల్లా సమాఖ్య, జిల్లాల సమాహారంగా రాష్ట్ర సమాఖ్య ఏర్పాటు చేస్తాం.  వచ్చే ఆర్థిక బడ్జెట్ లో దీని కోసం 500 కోట్ల సీడ్ క్యాపిటల్ అందిస్తాం,” అని ముఖ్యమంత్రి చెప్పారు.

 

‘రెండు మూడు సంవత్సరాలలో  ఈ డబ్బు రెండు మూడు  వేల కోట్లవుతుంది.రైతులు పండించాలి. పండిన పంటకు ధర రావాలి. అపుడేరైతు రాజు అవుతాడు.  రుణమాఫీ తర్వాత రాష్ట్రాన్ని  క్రాప్ కాలనీలుగా  గా విభజిస్తాం. ఏ జిల్లాలో ఏపంట వేయాలో ముందే నిర్ణయిస్తాం. రాష్రంలో వినియోగమెంతో లెక్కిస్తాం. బయట అమ్మెందుకు వీలయిన పంటల కోసం రైతులను సిద్ధం చేస్తాం. ఏ రైతు ఏపంట వేయాలో కూడా నిర్ణయిస్తాం,’ అని కెసిఆర్ చెప్పారు.

 

‘ఈ పథకంలోకి దళారీలు రావద్దు. లంచం పరిస్థితి వుండదు. రైతులు ధప్తర్ కు వెళ్లాల్సిన పనిలేదు. రెవిన్యూ విలేజ్ ఉంటుంది. భూమి లెక్కలుంటాయి. అవినీతి ఉండదు.  5 వేల ఎకరాలకు ఒక అగ్రికల్చర్  ఎక్స్ టెన్షన్ ఆపీసర్ ఉంటారు. ఇప్పటికే  1112 మందిని నియమించాం. వారికి  లాప్ టాప్ ఇస్తాం.  రైతుల, పేరు,భూమి వివరాలన్నీ అధికారి దగ్గిర ఉంటాయి. బ్యంకు ఖాతాలు తెరిపిస్తాం. మొదటి  పంటకు మే నెలలో , అక్టోబర్ లో  రెండో పంటకు నాలుగు వేలు చొప్పున వచ్చే ఏడాది నుంచి డిపాజిట్ చేస్తాం,’ అని ప్రకటించారు.

 

అనంతరం, వ్యవసాయ సీజన్లో రైతులు  కూలీలులేక ఇబ్బంది పడ్తున్నందున జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానం ప్రవేపెట్టారు. సభ ఆమోదించింది. ఈ విషయాన్ని  23న ఢిల్లీలో  జరగబోయే నీతి ఆయోగ్  సమావేశం ముందుంచుతానని కూడా ఆయన చెప్పారు.

 

ఉపన్యాసం చివర్లో కూడా సభలో ఉత్సాహం పెల్లుబకకపోవడం ఆశ్చర్యం.

 

Follow Us:
Download App:
  • android
  • ios