Asianet News TeluguAsianet News Telugu

కళ్లకు గంతలు కట్టి లేబర్ అధికారి హత్య: ఆర్ధిక వివాదాలే కారణం

 ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి ఎం. ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. వ్యాపార లావాదేవీల కారణంగానే స్నేహితుడే అతడిని హత్య చేసినట్టుగా పోలీసులు చెప్పారు.

Labour officer murdered in Bhupalpally
Author
Hyderabad, First Published Mar 11, 2020, 7:24 AM IST

ఖమ్మం: ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి ఎం. ఆనంద్ రెడ్డి హత్యకు గురయ్యారు. వ్యాపార లావాదేవీల కారణంగానే స్నేహితుడే అతడిని హత్య చేసినట్టుగా పోలీసులు చెప్పారు.మూడు రోజుల తర్వాత ఆనంద్ రెడ్డి మృతదేహం వెలుగు చూసింది.

Also read:అదృశ్యమైన లేబర్ ఆఫీసర్ దారుణహత్య..?

జనగామ జిల్లా ఓబుల్ కేశవాపూర్ కు చెందిన ఆనంద్ రెడ్డి ఖమ్మం జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారిగా పనిచేస్తున్నాడు. వరంగల్ అర్బన్ జిల్లా శనిగరానికి చెందిన ప్రదీప్ రెడ్డితో నాలుగేళ్లుగా ఆయన స్నేహంగా ఉన్నారు.

వీరిద్దరూ కూడ ఇసుక వ్యాపారంలో సుమారు రూ. 90 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ డబ్బుల విషయమై ఇద్దరు కూడ  పెద్ద మనుషుల మధ్య ఒప్పందం కుదుర్చుకొన్నారని సమాచారం. ఈ మేరకు భూమిని ఆనంద్ కు ఇస్తానని ప్రదీప్ రెడ్డి ఒప్పుకొన్నారని తెలుస్తోంది.

ఈ నెల 7వ తేదీ ఉదయం భూపాలపల్లిలో భూమి ఉందని చెప్పి ఆనంద్ రెడ్డిని ప్రదీప్ రెడ్డి తీసుకెళ్లాడు. అయితే తొలుత విందు చేసుకొన్న తర్వాత భూమి చూపిస్తామని చెప్పి ప్రదీప్ రెడ్డిని నమ్మించారు. 

ఈ క్రమంలోనే భూపాలపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లిన తర్వాత కళ్లకు గంతలు కట్టి చేతులు వెనక్కి కట్టి ఆనందర్ రెడ్డిని హత్య చేశారు. మృతదేహన్ని అక్కడే వదిలివేసి వచ్చారు. ఆరుగురు నిందితులు ఆనంద్ రెడ్డిని హత్య చేసిన ఘటనలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మంగళవారం నాడు రాత్రి ఆనంద్ రెడ్డి మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios