జపాన్ విద్యార్థుల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన కేటీఆర్. వాళ్ల స్పూర్తికి ఫిదా అయినా మంత్రి. అద్బుతమనని పొగిడిన కేటీఆర్.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయంగా ప్రతి క్షణం బీజిగా ఉండే వ్యక్తి. అయినా కూడా ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తారు. ఆయన ట్విట్టర్ లో ఖాతా తెరిచిన నాటి నుండి ప్రజలకు మరింత చేరువయ్యారు. ఎవ్వరు ఎలాంటి సమస్యను ఉన్న ఆయన దృష్టికి తీసుకువచ్చిన తక్షణమే స్పందించి, పరిష్కారానికి ప్రయత్నిస్తారు.
అంతే కాదు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ నుండి ప్రజలకు విలువైన సమాచారాన్ని కూడా అందిస్తారు. తాజాగా కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ నుండి అమూల్యమైన వీడియోను పోస్టు చేశారు. ఆ విడియో జపాన్ దేశానికి చెందిన పిల్లల వేడుక. అందులో ఒక అబ్బాయి కొంత ఎత్తైనా గోడపై జంప్ చేయ్యాలి.. కానీ ఆ పిల్లాడు మొదటి నాలుగు సార్లు అధిగమించలేకపోయ్యాడు. ఆ అబ్బాయి ఎడుపు ప్రారంభించారు. అప్పుడు పక్కల ఉన్న విద్యార్థులు అందరు వచ్చి ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేశారు. పిల్లలు ఇచ్చిన స్పూర్తికి పిల్లాడు ఈజీగా ఆ గోడను తన జంపింగ్ అధిగమించాడు.
ఈ వీడియోకు మంత్రి కేటీఆర్ ఇలా ట్యాగ్ చేశారు "ఒక జపాన్ పిల్లాడు 4 ప్రయత్నాల్లో అడ్డంకిని అధిగమించడానికి దూకడం విఫలమయాడు. అతని సహచరుల ప్రతిచర్యతో అధిగమించాడు. అది చాలా అమూల్యమైనది!"
మీరు ఓ సారి చూడండి.
