Asianet News TeluguAsianet News Telugu

సమత, హజీపూర్ అత్యాచార కేసులు.. న్యాయం చేశామంటూ కేటీఆర్ ట్వీట్

బాధితులకు త్వరగా న్యాయం అందేలా కృషి చేసిన లా అండ్ హోమ్ డిపార్ట్ మెంట్ , అధికారులకు ఈ సందర్భంగా తాను కుడోస్ తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. 

KTR Tweet on  quick justice over Samatha, Hazipur Incidents
Author
Hyderabad, First Published Feb 7, 2020, 2:30 PM IST

తెలంగాణలో ఇటీవల జరిగిన కొన్ని నేరాలకు శిక్ష పడిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గత ఏడాది లో జరిగిన సమత, హజీపూర్ ఘటనలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ట్వీట్ చేశారు.

Also Read హజీపూర్ సీరియల్ రేపిస్ట్, కిల్లర్ మొబైల్ లో 200కు పైగా పోర్న్ వీడియోలు...

కేవలం ఆరు నెలల్లో ఫాస్ట్రాక్ కోర్టులు  తెలంగాణలో మూడు ఘోరమైన నేరాలకు తీర్పు ఇచ్చాయని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళల పట్ల అత్యంత కిరాతకంగా ప్రవర్తించిన ఐదుగురు నిందితులకు కోర్టులు మరణ శిక్ష విధించాయని ఆయన పేర్కొన్నారు. 

బాధితులకు త్వరగా న్యాయం అందేలా కృషి చేసిన లా అండ్ హోమ్ డిపార్ట్ మెంట్ , అధికారులకు ఈ సందర్భంగా తాను కుడోస్ తెలియజేస్తున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు. 

 

కాగా... గతేడాది సమత అనే మహిళపై అత్యాచారానికి పాల్పడి అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులకు ఇటీవల ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హజీపూర్ లో ముగ్గురు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడి చంపేసిన శ్రీనివాస్ కి కూడా ఉరిశిక్ష విధించారు. ఈ క్రమంలో.. ఈ ఘటనల్లో సత్వర న్యాయం అందజేశారంటూ కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios